
Eretmuptera : అంటార్కిటికాలోని సిగ్నీ ద్వీపంలో సగం మంచు ఉంటుంది. అయితే కొన్నేళ్లం క్రితం ఆ దీపానికి వచ్చిన కీటకం ఏళ్ల తరబడి అక్కడే ఉండిపోయింది. సంతతిని పెంచుకుంటూ ఇప్పుడు ఒక ప్రళయాన్ని తీసుకువస్తుంది.
ఆ కీటకం ‘ఎరెట్‌మప్టేరా’. ఇది ద్వీపంలోని నేల స్వభావాన్నే మారుస్తుందని బ్రిటన్ అంటార్కిటిక్ సర్వే తేల్చింది. ఎరెట్‌మప్టేరా మృత సేంద్రీయ పదార్థాలను తింటుంది. దీంతో మొక్కలు వేగంగా కుల్లిపోతాయి. ఈ చర్యలతో నేలలో నైట్రేట్ స్థాయిలు దాదాపు ఐదు రేట్లు పెరుగుతుంది. ఇలా జరగడం వల్ల కొన్ని మొక్కల జాతులు అత్యంత ప్రమాదంలో పడతాయి. భూగర్భ జలాలు కూడా విపరీతంగా కలుషితం అవుతాయి. ఇక నీటిలో ఆల్గే రాజ్యమేలుతుంది. ఆక్సిజన్ శాతం విపరీతంగా పడిపోయి జలచరాలు మృత్యువాత పడతాయి. ఈ కీటకం లేని ప్రాంతాల్లో ఇలాంటి మార్పులు జరగడం లేదని పరిశోధనలు తెలపుతున్నాయి.
పెరుగుతున్న నైట్రేట్ శాతం..
ఎరెట్‌మప్టేరా కీటకం దక్షిణ జార్జియాకు చెందింది. 1960లో ఓ వృక్షశాస్త్ర పరిశోధన కారణంగా ఎరెట్‌మప్టేరా ఈ ద్వీపంలోకి వచ్చింది. దాని జాతి విస్తరణ 1980 నాటికి ద్వీపంలో స్పష్టంగా కనిపించింది. అయితే అదే ఈ రోజు ద్వీపంలో నైట్రేట్ పెరుగుదలకు కారణమని తెలుస్తోంది. గతంలో నీటిలోని జంతువులైన పెంగ్విన్, సీల్స్ సంచరించే ప్రాంతాల్లో మాత్రమేు నైట్రేట్ పెరుగుదలలో మార్పులు కనిపించేవి. కానీ ఎరెట్‌మప్టేరా కీటకం సంతతి పెరగడం వల్ల నైట్రేట్ శాతం అధికం అవుతున్నట్లు సమాచారం. బ్రిటీష్, అంటార్కిటిక్ సర్వే ప్రకారం కొన్ని చోట్ల చదరపు మీటర్ విస్తీర్ణంలో కీటక లార్వా సాంద్రత 20 వేల కంటే ఎక్కువ ఉన్నట్లు గుర్తించారు.
ఇలా రావచ్చు..!
ఈ ప్రమాదకరమైన కీటకం ఈ ఐలాండ్ లోకి ప్రవేుశించిన దానిపనై బిన్నాభిప్రాయాలు నెలకొన్నాయి. ఈ కీటకాలను తీసుకువచ్చింది మానవులే అని తేలింది. పర్యాటకులు, పరిశోధకులతో ఇక్కడికి రావచ్చన్న అనుమానులు నిజమని తెలుస్తోంది. వారి కాళ్లతో లేదా వారి బూట్లతో ఈ కీటకం ద్వీపం వరకూ వచ్చి ఉంటుందని అనుకుంటున్నారు. భూమితో పాటు ఈ కీటకం నీటిలోనూ బతుకగలదు. అంటార్కిటికాలో చాలా తక్కువ జాతులు నివసిస్తున్నాయి. ప్రపంచ పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో అంటార్కిటికాకు ప్రత్యేక స్థానం ఉంది. ఎరెట్‌మప్టేరా తరహాలో మరిన్ని జాతులు ఇందులోకి ప్రవేశిస్తే పర్యావరణం ఆందోళనకరంగా మారుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.