
పాకిస్తాన్ లో ఆహార సంక్షోభం నెలకొంది. ద్రవ్యోల్బణం దేశ చరిత్రలోనే అత్యంత దయనీయ స్థితికి చేరుకుంది. దాంతో నిత్యావసర సరుకుల ధరలు భారీగా పెరిగాయి. సామాన్యులు , పేదలు కొనలేని దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. అసలే పవిత్ర రంజాన్ మాసం కావడంతో కరాచీ లోని ఓ ఫ్యాక్టరీ ప్రజలకు గోధుమ పిండి , కొంత నగదు ఇస్తామని ప్రకటించడంతో పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు.
అయితే ఇరుకు సందు కావడంతో , త్వరగా తీసుకోవాలని, లేకపోతే సరుకులు అయిపోతాయని ప్రజలు భావించడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాట లో 12 మంది అక్కడికక్కడే మరణించారు. మరికొంతమంది గాయపడ్డారు. ఈ సంఘటన తీవ్రంగా కలిచివేసింది. దాంతో వెంటనే స్పందించిన ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 5 లక్షల ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. గాయపడిన వాళ్లకు 1 లక్ష ఆర్థిక సహాయం ప్రకటించింది.
పాకిస్తాన్ లో లీటర్ పెట్రోల్ ధర 272 రూపాయలు కాగా లీటర్ డీజిల్ ధర 293 రూపాయలుగా ఉంది. అలాగే నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటాయి. దాంతో పాక్ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.






