Israel Country :
ఉగ్రవాదం.. చాలా దేశాలను పట్టి పీడిస్తున్న భూతం . ఏదో ఒక రూపంలో దేశాల్లో అరాచకం సృష్టిస్తూనే ఉంటుంది. ఇండియాలో కూడా చాలా రాష్ర్టాల్లో అంతర్గత విభేదాలను ప్రోత్సహిస్తున్నది ఇలాంటి ఉగ్రవాద సంస్థలే. బెంగాల్ సహా మణిపూర్, అస్సాం లాంటి రాష్ర్టాల్లో వీటి ప్రభావం ఎక్కువ. ఇండియా పాలకుల ఓటు బ్యాంకు రాజకీయాలను ఆసరాగా చేసుకొని చాప కింద నీరులా ఎదుగుతూ పేట్రెగిపోతున్న ఇలాంటి వారికి బుద్ధి చెప్పాలంటే ఇజ్రాయెల్ ఫార్ములా నే పాటించాలని మేధావులు అభిప్రాయపడుతున్నారు.
ఇజ్రాయెల్.. తమ దేశం విషయంలో తప్పు చేసిన వాడు ఏమూలన ఉన్నా వదిలిపెట్టదు. వాడిని వెంటాడి, వేటాడి హతమారుస్తుంది. పాలస్తీనాలో శరణార్థుల ముసుగులో కొందరు చేస్తున్న ఆరాచకం గుర్తించింది. అక్కడ ఉన్న ఉగ్రవాదులను గుర్తించింది. కేవలం ఆ 12 మంది ఉగ్రవాదులే టార్గెట్ డ్రోన్ దాడులు నిర్వహించింది. వారిని గుట్టు చప్పుడు కాకుండా హతమార్చింది. శరణార్థుల శిబిరంలో తలదాచుకొని, మిస్సైళ్లతో విరుచుకుపడుతున్న ఉగ్రవాదుల ఆటకట్టించింది. ఇజ్రాయెల్ అంటే అదే. తమ దేశం విషయంలో తప్పు చేసి ఎక్కడా తలదాచుకున్నా బయటకు రప్పించి మరి గుణపాఠం చెబుతోంది.
ఇండియాలో కూడా జరగాల్సింది అది. పక్క దేశాల్లో కూర్చొని ఇండియాలో అంతర్గత ఘర్షణలకు ఊపిరి పోస్తున్న వారి విషయంలో నాన్చివేత ధోరణి పనిచేయదు. వీరి ఆగడాలకు అడ్డుకట్ట పడాలంటే ఇజ్రాయెల్ తరహా ఆపరేషన్లు జరగాల్సిందే. లేదంటే గతంలో స్వేచ్చగా మన ఆర్మీ శిబిరాలపైనే గ్రెనైడ్లు విసిరి, మన మిలటరీ వాహనాలపై బాంబుల దాడి చేసి ఎందరో సైనికులను బలి తీసుకుంటున్న మూకలకు బుద్ధి చెప్పకపోతే ఇదే పరిస్థితి రానున్న రోజుల్లో కూడా ఉంటుంది. ఉగ్రవాదాన్ని ఉక్కుపాదం తో అణిచివేస్తే తప్పా మరేం సాధ్యం కాదు. ఇండియాలో అడుగుపెట్టాలంటే ఉగ్రవాదులు భయపడేలా చేసిన రోజే ఇక ప్రశాంతంగా మన భారతం నిద్రపోతుంది.