
పెరు, ఈక్వెడార్ లోని గయాస్ తీరప్రాంతంలో శనివారం భారీ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్ పై 6. 8 గా నమోదైంది. 66 కిలోమీటర్ల లోతులో భూకంపాన్ని గుర్తించినట్లు అమెరికా జియోలాజికల్ సర్వే తెలిపింది. భూకంపం వల్ల పెద్ద ఎత్తున భవనాలు , ఇల్లు , నేలమట్టం అయ్యాయి. మచాలా , క్యుయెన్సా నగరాలలో భూకంప తీవ్రత ఎక్కువగా ఉంది. భూకంప ధాటికి మొత్తం 14 మంది చనిపోయారు. పెద్ద సంఖ్యలో జనాలు గాయపడ్డారు. గాయపడిన వాళ్ళను ఆసుపత్రికి తరలించారు.