ఇటీవల కాలంలో పెళ్లిళ్లను విభిన్నంగా జరుపుకునే వధూవరులను తరచుగా చూస్తూనే ఉన్నాం. అందరిలా పెళ్లి చేసుకుంటే కిక్ ఏముంది ? అందుకే విభిన్న మార్గాలలో పెళ్లి చేసుకోవాలని ఆశ పడుతున్నారు. ఇలా చాలామంది పెళ్లిళ్లు చేసుకోగా అలాంటి పెళ్లిళ్లను చూసి ఔరా ! అనుకున్నారు. అరె ….. మనం ఇలా పెళ్లి చేసుకోలేక పోయామే అని బాధపడిన వాళ్ళు ఉన్నారు. అయ్యో…. మనకు ఇలాంటి ఐడియా రాలేదే అని అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు.
అయితే తాజాగా ఓ జంట చేసుకున్న వివాహం గురించి తెలిస్తే మాత్రం ఇలాంటి పెళ్లిళ్లు వద్దు బాబోయ్ అంటారు. ఎందుకంటే తమ పెళ్లిని విభిన్నంగా చేసుకోవాలని అనుకున్న ఓ జంట హెలికాప్టర్ లో పెళ్లి చేసుకున్నారు. బంధు , మిత్రులంతా ఆ పెళ్లికి వచ్చారు. అందరి ముందు హెలికాప్టర్ ఎక్కి అందులో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లి అయ్యాక హెలికాప్టర్ కిందకు దిగుతున్న సమయంలో ఒక్కసారిగా కుప్పకూలింది.
తమ కళ్ళ ముందే కొత్త జంట హెలికాప్టర్ శిథిలాలలో చిక్కుకోవడం , వాళ్ళను రక్షించాలని చేసిన ప్రయత్నాలు విఫలం కావడం ……. క్షణాల్లో హెలికాప్టర్ లో మంటలు చెలరేగి బూడిద కావడం అందులో నూతన వధూవరులు కాలిపోవడం చూసి గుండెలవిసేలా ఏడ్చారు బంధు మిత్రులు. కొత్త జీవితం మొదలు పెట్టాలని భావించిన నూతన దంపతులు తమ కళ్ళ ముందే కాలి బూడిద అవుతుంటే ఆ జంట హాహాకారాలు వింటూ సహాయం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్న బంధు మిత్రుల రోదన వర్ణనాతీతమనే చెప్పాలి. విలాసవంతమైన పెళ్లి , విలాసవంతమైన జీవితం కాదు కావాల్సింది …… బ్రతికి ఉన్నన్నాళ్ళు సంతోషంగా ఉండాలి ….. అదే సుసంపన్నమైన జీవితం.