Tesla manufactures carsభారత్ లో టెస్లాకు చెందిన లగ్జరీ కార్లు అతి త్వరలోనే రాబోతున్నాయి. ఈమేరకు టెస్లా భారత్ లో పెట్టుబడులపై చర్చించినట్లు తెలుస్తోంది. ఏడాదికి ఐదు లక్షల ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి సామర్థ్యంతో ఫ్యాక్టరీని ఏర్పాటు చేసేందుకు టెస్లా సుముఖంగా ఉన్నట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా ఒక నివేదికలో పేర్కొంది.
ఇండియాలో తయారయ్యే టెస్లా ఎలక్ట్రిక్ కార్ల ప్రారంభ ధర రూ.24వేల 400 డాలర్ల నుంచి ప్రారంభం కానుందని సమాచారం. అంటే మన కరెన్సీలో దీని విలువ రూ. 20లక్షలుగా ఉంటుందని టైమ్స్ ఆఫ్ ఇండియా గురువారం తన నివేదికలో పేర్కొంది. అయితే దీనిపై టెస్లా మాత్రం స్పందించలేదు.
కాగా ప్రధాన మంత్రి మోదీ ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తో భేటి అయ్యారు. ఈమేరకు భారత్ లో భారీగా పెట్టుబడులు పెట్టేందుకు ఎలాన్ మస్క్ ను ఆహ్వానించారు. ఇందులో భాగంగానే టెస్లా ఎగ్లరీ కార్లను భారత్ బేస్ గా ఎగుమతి చేసేందుకు ఎలాన్ మస్క్ కసరత్తులు చేస్తున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే టెస్లా కంపెనీ భారత్ లో పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్లను తయారు చేసే అవకాశం ఉందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.