టర్కీ , సిరియా లలో భూకంపం సృష్టించిన విలయం అంతాఇంతా కాదు. తవ్వేకొద్దీ శవాల గుట్టలు బయటపడుతూనే ఉన్నాయి. 20 లేదా 30 వేల లోపే మృతుల సంఖ్య ఉండొచ్చని భావించారు మొదట. కానీ శిథిలాలను తొలగిస్తున్న కొద్దీ శవాలు బయటపడుతున్నాయి. దాంతో ఇప్పటి వరకు 50 వేలకు పైగా మృత్యువాత పడినట్లు తెలుస్తోంది.
ఇంకా ఈ లెక్కలు మరింతగా పెరిగేలా కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 6 న టర్కీ , సిరియా లలో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే. ఆ భూకంప తీవ్రత ఉభయ దేశాలను వణికిపోయేలా చేసింది. టర్కీలో అత్యధికంగా 44,218 మంది మరణించగా సిరియా లో 5,914 మంది మరణించారు. దాంతో టర్కీ , సిరియా లలో 50 వేలకు పైగా మరణించారని ప్రకటించారు. ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారత్ కూడా పెద్ద ఎత్తున సహాయ సహకారాలను అందిస్తోంది.