
ట్విట్టర్ చేసిన ఓ పని టెక్ ప్రపంచాన్ని కలవరానికి గురిచేస్తోంది. మరి ముఖ్యంగా సినీ రాజకీయ ప్రముఖులకు ఝలక్ ఇచ్చింది. ఏప్రిల్ 1 నుంచి కేవలం డబ్బు చెల్లించిన వారి ఖాతాలకు మాత్రమే బ్లూటిక్ ఉంటుందని ట్విట్టర్ ప్రకటించింది. గతంలో సెలబ్రిటీలు, రాజకీయ నాయకులు, ఇతర ప్రముఖులు, జర్నలిస్టులు వంటి వారికి బ్లూ టిక్ వెరిఫికేషన్ ఉచితంగానే ఇచ్చారు. కానీ ఇప్పుడు ఎవరు డబ్బు చెల్లిస్తే వారికి మాత్రమే వెరిఫికేషన్ ఇస్తామని ట్విట్టర్ ప్రకటించింది. అయినప్పటికీ ప్రముఖులు పెద్దగా పట్టించుకోలేదు.దీంతో డబ్బులు చెల్లించని సినీ రాజకీయ ప్రముఖల సబ్‌స్క్రైబ్ డీయాక్టివేట్ అవ్వడం హాట్ టాపిక్ గా మారింది.
బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ , షారుఖ్ ఖాన్ , అలియా భట్, దీపికా పదుకొనే, అనుష్క శర్మ టాలీవుడ్ నుంచి చిరంజీవి, మోహన్ బాబు, అల్లు అర్జున్, వెంకటేష్, ప్రకాశ్ రాజ్, మంచు మనోజ్, మంచు లక్ష్మీ, రకుల్ ప్రీత్ సింగ్, నితిన్, రామ్ చరణ్, పవన్ కల్యాణ్, ప్రకాష్ రాజ్, మంచు మనోజ్ ,నాగ చైతన్య, అక్కినేని అఖిల్ బ్లూ టిక్ కోల్పోయారు. అయితే కొందరు సెలబ్రిటీలు ఇప్పటికే సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నారు. వారికి మాత్రం బ్లూ టిక్ కంటిన్యూ అవుతోంది. సినీ హీరోలు జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాన్ రామ్, డైరెక్టర్ రాజమౌళి, మహేష్ బాబు, అక్కినేని నాగార్జున, మంచు విష్ణులకు బ్లూ టిక్ కంటిన్యూ అవుతోంది. అటు బ్లూటిక్ కోల్పోవడంపై ప్రకాష్ రాజ్ తనదైన స్టైల్ లో స్పందించాడు. బై బై బ్లూ టిక్’ అంటూ చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.
బ్లూ టిక్ ఉన్న సెలబ్రిటీ, రాజకీయ నేత, క్రీడాకారులు, సంస్థలు అకౌంట్స్ ఒరిజినల్ అకౌంట్స్ అని నిర్ధారణ అవుతాయి. వారి పేరుతో ఇతరులు ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసినా.. ఒరిజనల్ అకౌంట్ కావని యూజర్లకు అర్థమయ్యేందుకు ఈ విధానాన్ని ట్విట్టర్ ప్రవేశపెట్టింది. ఇప్పుడు బ్లూ టిక్ కావాలంటే నెలకు 11 డాలర్లు చెల్లించాలని రూల్ విధించాడు. కొందరు చెల్లించకపోవడంతో బ్లూ టిక్ తీసివేశారు. అయితే రాత్రికి రాత్రే బ్లూ టిక్ తొలగించడంపై పలువురు ప్రముఖులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ట్విట్టర్‌ను ఎలాన్ మస్క్ కొనుగోలు చేసిన తర్వాత రూపురేఖలు మార్చేశాడు.






