నేపాల్ కొత్త అధ్యక్షుడుగా రామచంద్ర పౌడెల్ ఎన్నికయ్యారు. నేపాలీ కాంగ్రెస్ కు చెందిన రామచంద్ర పౌడెల్ ను ప్రజాప్రతినిధులు ఎన్నుకోవడంతో నేపాల్ కొత్త అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. రామచంద్ర పౌడెల్ ఎన్నికతో ప్రధానమంత్రి ప్రచండకు భారీ ఊరట లభించింది.
రామచంద్ర పౌడెల్ నేపాల్ కు ప్రధాన మంత్రిగా పలుమార్లు పోటీ పడ్డారు. 17 సార్లు ప్రధాని పదవికి పోటీ చేసి ఓటమి చవిచూశారు. స్పీకర్ గా , డిప్యూటీ ప్రైమ్ మినిష్టర్ గా సేవలు అందించారు రామచంద్ర. అయితే తన చిరకాలవాంఛ ప్రధాని పదవి. ఆ పదవి కోసం ఏకంగా గజినీ మహమ్మద్ లాగా 17 సార్లు పోటీపడ్డారు. అయితే అది అందని ద్రాక్షే అయ్యింది పాపం.
కట్ చేస్తే రామచంద్ర పౌడెల్ నేపాల్ ప్రెసిడెంట్ అయ్యారు. రామచంద్ర ప్రెసిడెంట్ కావడంతో ప్రచండ ఊపిరి పీల్చుకున్నాడరు. రామచంద్రకు 214 మంది ఎంపీలు , 352 మంది ప్రొవిన్షియన్ అసెంబ్లీ సభ్యులు ఓట్లు వేశారు. దాంతో రామచంద్ర పౌడెల్ నేపాల్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.