
స్మార్ట్ ఫోన్లు ఈరోజుల్లో మనుషుల దైనందిన జీవితంలో భాగమైపోయాయి. అవసరమున్న లేకున్నా స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు అనేంతగా ప్రతి ఒక్కరూ అడక్టైపోయారు. నిద్రలేవగానే స్మార్ట్ ఫోన్ ను చూడడం సర్వసాధారణం అయిపోయింది. లేచింది మొదలు పడుకునే అంతవరకు స్మార్ట్ ఫోన్ చేతిలోనే ఉండే పరిస్థితి దాపురించింది. అవసరానికి మాత్రమే వాడే ఈ స్మార్ట్ ఫోన్ ను అవసరం కంటే ఎక్కువ వాడుతున్నారు. ఫలితంగా విజ్ఞానం మాట అలా ఉంచితే భద్రత పరంగా కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. ముఖ్యంగా పిల్లలు స్మార్ట్ ఫోన్ కు చాలా ప్రభావితం అవుతున్నారు. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ వినియోగించే టప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలేంటో చూద్దాం..
* పాటించవలసిన జాగ్రత్తలు
1.ఎండ పడే ప్రదేశాల్లో ఫోన్ చార్జింగ్ పెట్టకూడదు. ఎండప డే ప్రదేశాల్లో చార్జింగ్ పెడితే స్మార్ట్ ఫోన్లలోని బ్యాటరీలో ఉండే లిథియం ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులకు గురై తొందరగా డ్యామేజ్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఒక్కోసారి బ్యాటరీ పేలిపోయి అవకాశం కూడా ఉంటుంది.అందువల్ల ఎండలో చార్జింగ్ పెట్టకూడదు.
2. సిగ్నల్స్ తక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఫోన్ వాడొద్దు.. దీనివల్ల ఫోన్ సీపీయూ పై చాలా వెయిట్ పడుతుంది.
3. ఎక్కవ సేపు అదేపనిగా ఫోన్ మాట్లాడకూడదు. దీని వల్ల ఫోన్ హీట్ అయ్యే అవకాశం ఉంటుంది.
4. ఎక్కువ సేపు పిల్లలను ఫోన్ లో గేమ్స్ ఆడనివ్వకూడదు. ఫోన్ లో గేమ్స్ ఆడడం వల్ల ఫోన్ తొందరగా హీట్ అవడం తోపాటు టచ్ కూడా పోయి అవకాశం ఉంటుంది.
5. ఎండలో ఫోన్ చూడడం వల్ల సూర్యుని కిరణాలు స్క్రీన్ మీద నేరుగా పడి కళ్ల కు చాలా హనీ కలిగి అందత్వం ఏర్పడే అవకాశం ఉంటుంది.
6. ఎక్కువ సేపు స్మార్టీఫోన్, లేదా కంప్యూటర్ పై పని చేయాలిసి వస్తే 20-20 రూల్స్ ను పాటించాలి. అంటే ప్రతి 20 నిముషాలకు ఒకసారి 20 సెకండ్స్ 20 ఫీట్స్ దూరం లో ఉన్న వస్తువులను నిషితంగా చూడాలి. దీంతో కళ్లపై ఒత్తిడి తగ్గుతుంది.
* ఎండలో ఫోన్ వాడడం చాలా ప్రమాదకరం..
ఎండలో ఫోన్ వాడటం మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ మధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ల వాడకం బాగా పెరిగింది. కాబట్టి మొబైల్ లేకుండా జీవించడం కష్టం. కొంతమంది ఫోన్ లేకుండా బయట అడుగు పెట్టరు. బస్‌లో ఉన్నా, బైక్‌పై వెళ్లాలన్నా, రోడ్డుపై వెళ్తున్నప్పుడూ కూడా ఫోన్ చూడటం మామూ లైపోయింది. మొబైల్ అనివార్యమైన ఈ రోజుల్లో మొబైల్ వాడకుండా ఉండటమనేది చాలా కష్టం. కాబట్టి వేసవిలో మొబైల్ ఉపయోగిస్తున్నప్పుడు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.






