
Beets for weight loss : మనం దుంపల్లో కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉంటాయని వాటిని తినడం మానేస్తుంటాం. కానీ వాటితో కూడా మన బరువును కంట్రోలో లో ఉంచుకోవచ్చు. దుంపల్లో కార్బోహైడ్రేడ్లు ఉండటంతోనే వాటిని తినకూడదని ఫిక్స్ అవుతుంటాం. అవి కూడా మనకు మేలు చేస్తాయి. దుంపల్లో క్యారెట్, చిలగడ దుంప, బీట్ రూట్ తదితర వంటివి మనకు మేలు చేస్తాయి. మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అందుకే వాటిని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం మంచిదే.
రూట్ వెజిటబుల్స్ లో పోషకాలు ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి పరోక్షంగా కారణంగా నిలుస్తాయి. దీంతో వీటిని తినడం వల్ల ప్రయోజనాలు ఎక్కువే ఉంటాయి. బరువు తగ్గడానికి దుంప కూరలు కూడా ఉపయోగపడతాయి. క్యారెట్ లో ప్రొటీన్లు ఎన్నో ఉంటాయి. తక్కువ కేలరీల శక్తి ఉంటుంది. డైటరీ ఫైబర్ , విటమిన్ ఎ,సి, పొటాషియం, బీటా కెరోటిన్ వంటి లక్షణాలు మనకు మేలు చేస్తాయి.
ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. ఉల్లి వాడకంతో మనకు ఉపయోగాలు ఎన్నో ఉంటాయి. ఇందులో ప్రీ బయోటిక్ ఫైబర్ ఉండటం వల్ల గుడ్ బ్యాక్టీరియా పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ సి, ఫోలేట్ , విటమిన్ బి6, పొటాషియం, మెగ్నిషియం, కాల్షియం వంటి పోషకాలు ఉండటంతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
చిలగడ దుంప మనకు ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. ఇందులో ఉండే విటమిన్లతో ఊబకాయం నుంచి రక్షణ పొందవచ్చు. ఇంకా బీట్ రూట్ కూడా మన బరువును నియంత్రిస్తుంది. అందుకే దుంపలు కూడా మనకు మంచి చేస్తాయి. ఇలా దుంపలు తీసుకుని మనం అధిక బరువు సమస్య నుంచి బయట పడొచ్చు. ఇందులో ఉండే పోషకాలు మనకు మేలు చేస్తాయి.