
lemon water : ఈ రోజుల్లో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతున్నారు. పొట్ట నిండా కొవ్వు పేరుకుపోవడంతో బొజ్జలు వేసుకుని తిరుగుతున్నారు. దీంతో సరిగా నడవాలంటేనే ఆయాసం వస్తుంది. పొట్టను ఎలా పోగొట్టుకోవాలని నానా రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. సరైన వ్యాయామం లేకపోవడం, జంక్ ఫుడ్స్ తీసుకోవడం, సరైన జీవన శైలి లేకపోవడం వంటి కారణాలతో అధిక బరువు ముప్పు ఏర్పడుతోంది.
వాకింగ్ చేస్తూ ఆహార నియమాలు పాటిస్తూ ఉంటే అధిక బరువు తగ్గొచ్చు. కానీ వాటి మీద ఫోకస్ చేయడం లేదు. ఫలితంగా అధిక బరువు ఇబ్బందులకు గురిచేస్తోంది. నిమ్మకాయ నీటిలో తేనె కలుపుకుని తాగడం వల్ల కూడా ఉపశమనం లభిస్తుంది. కానీ అది కూడా సక్రమంగా చేయడం లేదు. దీంతోనే అధిక బరువు సమస్య జఠిలంగా మారుతోంది.
నిమ్మకాయ నీళ్లు తాగడం వల్ల మూత్రపిండాల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రోగ నిరోధక శక్తి పెరగడంలో దోహదపడుతుంది. ఇన్ని రకాల లాభాలున్న నిమ్మకాయ నీళ్లు ఉదయం పూటనే తాగాలి. గోరువెచ్చని నీటిలో నిమ్మకాయ పిండుకుని తేనె కలుపుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. అధిక బరువు నుంచి పరిష్కారం దొరుకుతుంది.
కొందరు నిమ్మకాయ నీళ్లలో పంచదార వేసుకుంటారు. అలా చేయొద్దు. తేనె మాత్రమే కలుపుకోవాలి. పంచదార వేస్తే ఫలితం ఉండదు. ఇక్కడే తప్పు చేస్తారు. ఆ నీళ్లు కూడా వేడిగా ఉండకూడదు. గోరు వెచ్చగా మాత్రమే ఉండాలి. బాగా వేడి నీళ్లలో తేనె వేస్తే కూడా అది పనిచేయదు. అందుకే మనం తాగే విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుని తాగితే ఫలితం వస్తుంది.