
hair related problems : ప్రస్తుత కాలంలో జుట్టు రాలిపోవడం, తెల్లబడటం సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. వాతావరణ కాలుష్యం, పోషకాహార లోపం, వివిధ రకాల షాంపూల వాడకం తదితర కారణాలతో జుట్టు రాలిపోవడం, తెల్ల బడటం జరుగుతోంది. దీంతో నలుగురిలో తిరగలేక సతమతమవుతున్నారు. జుట్టును కాపాడుకోవడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు.
దీనికి ఓ మంచి చిట్కా ఉంది. మూడు టీ స్పూన్ల కలబంద గుజ్జు తీసుకోవాలి. రెండు టీ స్పూన్ల కొబ్బరినూనె అందులో వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్లకు పట్టించాలి. ఐదు నిమిషాలు మెల్లగా మర్దన చేసుకోవాలి. తరువాత హెయిర్ క్యాపు పెట్టుకుని రాత్రంతా అలాగే ఉండాలి. ఇలా చేయడం వల్ల జుట్టు సమస్య తొందరగా నయం అవుతుంది.
మరునాడు ఉదయం షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. తలలో చుండ్రు సమస్యతో పాటు దురద కూడా లేకుండా పోతుంది. జుట్టుకు కావాల్సిన పోషకాలు అందుతాయి. దీంతో జుట్టు రాలే, తెల్లబడే సమస్య పూర్తిగా నయమవుతుంది. ఈ చిట్కా వాడితే జుట్టు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లు అవుతుంది.
ఈ చిట్కా ఉపయోగించుకుని జుట్టు సమస్యకు చెక్ పెట్టుకోవచ్చు. మన ఆయుర్వేదంలో ఎన్నో రకాల పద్ధతులు ఉన్నాయి. వాటిని ఉపయోగించుకుని మన సమస్యను దూరం చేసుకోవచ్చు. ఆధునిక కాలంలో ఇలాంటి సమస్య అందరిని వేధిస్తోంది. జుట్టు బాగుంటేనే అందంగా కనిపిస్తారు. లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో జుట్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.