
Cinnamon : దాల్చిన చెక్కకు ఆయుర్వేదంలో ఎంతో ప్రాధాన్యముంది. దీన్ని చాలా రకాలుగా వాడతారు. కానీ మనకు మాత్రం బిర్యాణీ చేసుకునేటప్పుడు మాత్రం కచ్చితంగా గుర్తుకొస్తుంది. ఎందుకంటే దీంతో మంచి సువాసన వస్తుంది. ఆహారం మంచి రుచిగా మారుతుంది. అందుకే బిర్యాణీలో దీన్ని వేసి వండుకోవడం సహజం. కానీ ఇందులో ఎన్నో ఔషధ గుణాలున్నాయనే విషయం చాలా మందికి తెలియదు.
వంధత్వాన్ని దూరం చేస్తుంది. దీన్ని రోజు వాడితే హార్మోన్లలో మంచి కదలికలు వచ్చి దంపతులకు సంతానం కలిగించడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. మధుమేహానికి మంచి మందుగా ఉపయోగపడుతుంది. రోజు దవడకు వేసుకుని చప్పరిస్తూ ఉంటే రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గిస్తుంది. ఇంకా చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. గుండెకు మేలు చేస్తుంది.
నెలసరి సమస్యలకు కూడా చెక్ పెడుతుంది. ఈ రోజుల్లో చాలా మంది రెండు మూడు నెలలకోసారి కాని రుతుక్రమం రావడం లేదు. ఈ సమస్యకు ఇది పరిష్కారం చూపుతుంది. ఇందులో పీచు అధికంగా ఉండటంతో మంచి లాభాలుంటాయి. మాంగనీసు, ఐరన్, కాల్షియం కూడా అధికంగానే ఉంటాయి. అందుకే మన ఆరోగ్య పరిరక్షణలో ఇది దోహదపడుతుంది.
అల్జీమర్, పార్కిన్ సన్, మల్టిఫుల్ స్కెరోసిన్, మెనలింగ్లయిటిన్, బ్రెయిన్ లాంటి వాటి కణాల మరణంతో తలెత్తే వ్యాధులను దూరం చేస్తుంది. వండిన పదార్థాలు పాడవకుండా కాపాడుతుంది. ఇలా దాల్చిన చెక్కతో మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. దీంతో దాల్చిన చెక్క వాడుకుని మనం ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.