Date Cultivation : అత్యంత పోషకాలు కలిగిన పండ్లలో ఖర్జూరాలు ముఖ్యమైనవి. వీటిని తినడం వల్ల ఎన్నో రకాల లాభాలున్నాయి. ఎడారి పంట అయిన ఖర్జూరాన్ని మధ్య ఆసియా, ఉత్తర ఆఫ్రికా దేశాల్లో ఎక్కువగా పండిస్తారు. మన దేశంలో కూడా రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో పండిస్తున్నారు. దీంతో ఖర్జూరాల వినియోగం ఇటీవల కాలంలో పెరిగిపోయింది. అందరు వీటిని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ధర ఎంతైనా ఫర్వాలేదు. ఆరోగ్యం కోసం తింటున్నారు.
మనదేశం దుబాయ్, సౌదీ, ఒమన్, ఖతర్, బహ్రెయిన్ వంటి దేశాల్లో సాగు చేస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాల్లో అనంతపురం జిల్లాలో వీటిని సాగుచేస్తుంటారు. ప్రస్తుతం బాపట్లకు విస్తరించింది. బాపట్ల నియోజకవర్గంలోని అద్దంకి, బల్లికురవ, కొరిశపాడు మండలాల్లో 6.8 ఎకరాలలో పండిస్తున్నారు. అద్దంకి మండలంలోని తిమ్మాయపాలెం గ్రామంలో ఉప్పుటూరి చిరంజీవి అనే రైతు 2.5 ఎకరాల్లో నాణ్యమైన రకం సాగు చేస్తున్నారు.
దుబాయ్ నుంచి మొక్కలు తెప్పించి విక్రయించే తమిళనాడు వ్యాపారి నిజాముద్దీన్ దగ్గర మొక్కలు కొనుగోలు చేసి సాగు చేస్తున్నారు. ఖర్జూరం సాగుచేయడానికి అనుకూలమైన నేలల్లో తువ్వ (తెల్ల), గరప, నల్ల నేల, బంక నేలతో పాటు పీహెచ్ విలువ 8 నుంచి 10 వరకు ఉన్న చౌడు భూముల్లోనూ సాగు చేసుకోవచ్చు. ఉష్ణోగ్రత 25 నుంచి 40 డిగ్రీల వరకు ఉంటే దిగుబడి వస్తుంది. అధిక వర్షాలు, చలిగాలులు ఖర్జూరం పంటకు ఇబ్బందిగా ఉంటుంది.
ఈ పంట డిసెంబర్ లో పూతకు వస్తుంది. ఎకరాకు రూ. 4 లక్షల వరకు ఖర్చవుతుంది. మూడో ఏడాది నుంచి 40 ఏళ్ల పాటు కాత కాస్తూనే ఉంటుంది. నాటిన నుంచి ఏడేళ్ల వరకు అంతర పంటగా పప్పు ధాన్యాలు, పశువుల మేత వంటివి సాగుచేసుకునే అవకాశం ఉంటుంది. వీటికి కిలోకు రూ.250 ధర ఉంటుంది. గుజరాత్, రాజస్థాన్ నుంచి మొక్కలు తెప్పించుకుని పెట్టుకోవచ్చు