Diabeties: డయాబెటీస్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తునన అత్యంత ప్రమాదకరమైన జబ్బు. మధుమేహం క్రమంగా శరీరంలోని అన్ని భాగాలను ప్రభావితం చేస్తుంది. ప్రపంచ మధుమేహ దినోత్సవాన్ని ఏటా నవంబర్ 14న జరుపుకుంటారు. ఈ జీవనశైలికి సంబంధించిన వ్యాధులు, దాని ప్రమాదాల గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తారు. తద్వారా మధుమేహం బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న యువత శాతం గత 30 ఏళ్లలో రెండింతలు పెరిగిందని లాన్సెట్ జర్నల్ తాజా నివేదిక వెల్లడించింది. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఇది మరింత ప్రమాదకరంగా మారుతున్నది.ది లాన్సెట్ జర్నల్‌లో నివేదిక ప్రకారం, 2022లో ప్రపంచవ్యాప్తంగా 14 శాతం మంది యువత తీవ్రమైన ఆనారోగ్యానికి గురయ్యారు. కాగా 1990లో ఈ సంఖ్య 7 శాతం మాత్రమే. ప్రస్తుతం 800 మిలియన్లకు పైగా ప్రజలు డయాబెటీస్ తో బాధపడుతున్నారు, అయితే 1990లో ఈ సంఖ్య 200 మిలియన్ల కంటే తక్కువగా ఉంది. ఈ నివేదికలో మధుమేహం టైప్ 1, టైప్ 2 ఉన్న రోగులు ఉన్నారు. ముఖ్యంగా డయాబెటిస్ టైప్ 1 చిన్న వయస్సు నుండే ప్రభావితం చేస్తున్నది. చికిత్స చేయడం మరింత కష్టంగా మారుతున్నది. శరీరంలో తగినంత ఇన్సులిన్ లేకపోవడంతో ఈ వ్యాధి బారిన పడుతున్నారు..
డయాబెటిస్ టైప్ 2 ముప్పు ఎవరికి?
టైప్ 2 మధుమేహం మధ్య వయస్కులు లేదా వృద్ధులపై ప్రభావం చూపుతున్నది. వారిలో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గుతుండడమే ఇందుకు కారణం. జపాన్, కెనడా, ఫ్రాన్స్, డెన్మార్క్ వంటి కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మధుమేహ వ్యాధిగ్రస్తుల రేటు అలాగే ఉందని, కాస్త తగ్గిందని నివేదిక పేర్కొంది.
వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరగడానికి కారణం?
స్థూలకాయం టైప్ 2 డయాబెటీస్‌కు ప్రధాన కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గతి తప్పిన జీవనశైలి, ఆహారపు అలవాట్లలో మార్పు కారణంగా మధుమేహం ముప్పు పెరుగుతోంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో 30 ఏళ్లు పైబడిన వారిలో ఐదుగురిలో ముగ్గురు ఉంటున్నారు. అందులో దాదాపు మూడింట ఒక వంతు మంది వ్యాధిగ్రస్తులు భారతదేశంలోనే ఉన్నారు. సకాలంలో వైద్యం అందక మధుమేహ వ్యాధిగ్రస్తులు మరింత అనారోగ్యానికి గురువుతున్నారు. డయాబెటిక్ పేషెంట్లలో ఎన్నో ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. ఇందులో గుండె సంబంధిత వ్యాధులు, కిడ్నీ ఫెయిల్యూర్, చూపు మందగించడం, కాలేయంపై ప్రభావం వంటి పలు అనారోగ్య సమస్యలు అకాల మరణానికి దారి తీస్తున్నాయి.