
BP : ప్రస్తుత కాలంలో హైపర్ టెన్షన్ (అధిక రక్తపోటు) సమస్య అందరిని వేధిస్తుంది. షుగర్ తో పాటు బీపీ కూడా వస్తుంది. దీంతో రెండింటితో వేగలేకపోతుంటారు. దీంతో నిత్యం మందులు వేసుకుంటూ ఉంటారు. మనం బీపీతో బాధపడుతున్నప్పుడు కొన్ని ఆహారాలకు దూరంగా ఉండటమే మంచిది. లేకపోతే అనర్థాలు వస్తాయి. అందుకే జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.
బీపీతో సతమతమవుతున్నప్పుడు మాంసాహారాలు అధికంగా తీసుకోకూడదు. ఏ నెలకోసారి అంటే ఏం కాదు. కానీ వారానికి ఒకసారి తింటే బీపీ పెరుగుతుంది. ఫలితంగా ఇతర జబ్బులు వస్తాయి. కూరగాయలు, ధాన్యాలు, ఆలివ్ ఆయిల్, బీన్స్ , చేపలు వంటివి తీసుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అంతేకాని అన్నింటిని తింటే ఆరోగ్యం దెబ్బ తినడం ఖాయం.
బీపీతో బాదపడుతున్నప్పుడు జంక్ ఫుడ్స్ కు దూరంగా ఉండాలి. వీటికి బదులు పండ్లు, కూరగాయలు, బీన్స్, చికెన్, చేపలు వంటి వాటిని తీసుకుంటే సరి. బీపీ మెడిసిన్ వేసుకునేటప్పుడు మూత్ర విసర్జన ఎక్కువగా చేయాల్సి వస్తుంది. దీంతో మనం కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. ఇలా బీపీ ఉన్నప్పుడు మనం తీసుకునే ఆహారం విషయంలో అప్రమత్తంగానే ఉండాలి.
మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉండకూడదు. వాటి వల్ల బీపీ పెరుగుతుంది. తద్వారా ఆరోగ్యం దెబ్బ తింటుంది. మనకు ఎన్నో రకాల సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. అందుకే మనం సరైన విధంగా జీవనశైలి మార్చుకోవడం సురక్షితం. దీంతో మనకు ఎలాంటి నష్టాలు రాకుండా కాపాడుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.