
నేటి రోజుల్లో మద్యం, మాంసం, ధూమపానం చేయని వారు కనిపించడం లేదు. భూతద్దం వేసి వెతికినా భూ ప్రపంచంలో ఈ అలవాట్లు లేని వారు కనిపించడం లేదు. ఇంకా తాగని వాడిని ఏదో అంటరాని వాడిగా చూస్తారు. మద్యం అలవాటుతో కాలేయం, ధూమపానంతో ఊపిరితిత్తులు, మాంసంతో ఇతర అవయవాలు దెబ్బతినడం ఖాయం. కానీ వీటిని ఎవరు మానడం లేదు. ఫలితంగా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. కానీ వీటిని మాత్రం వదిలిపెట్టడం లేదు.
కాలేయ సంబంధిత సమస్యలకు ఓ చక్కని పరిష్కార మార్గం ఉంది. ఇది పాటిస్తే మీ లివర్ ఎంత డ్యామేజ్ అయినా మళ్లీ పూర్వ స్థితికి రావడం సహజం. చాలా సులభమైన చిట్కా. మన ఇంటిలోనే చేసుకోవచ్చు. దీనికి పెద్దగా ఖర్చు కూడా ఉండదు. గుప్పెడు శనగలు తీసుకుని నీళ్లల్లో వేసి ఉడికించుకోవాలి. అవి బాగా ఉడికాక బయట ఓ పాత్రలోకి తీసుకుని అందులో కాస్త ఉప్పు వేసి కలుపుకుని రోజు ఉదయం పరగడుపున తినడం వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. భోజనానికి ఓ అరగంట ముందు ఇవి తినాలి.
ఇంకా బాణపొట్టను దూరం చేసుకోవడానికి కూడా ఓ సింపుల్ చిట్కా ఉంది. రెండు నిమ్మకాయలను చిన్న ముక్కలుగా చేసుకోవాలి. తరువాత ఓ కీర దోసకాయను కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొంచెం పుదీనా ఆకులు తీసుకోవాలి. వాటిని ఓ పాత్రలో నీళ్లు పోసి అందులో వీటిని వేసుకోవాలి. తరువాత ఫ్రిజ్ లో పెట్టుకుని దాహం వేసినప్పుడల్లా ఆ నీరు తాగితే బాణపొట్ట మాయం అవుతుంది.
ఇలా సింపుల్ చిట్కాలు పాటించి మన దీర్ఘకాల రోగాలను దూరం చేసుకోవడం మంచిది. మన శరీరంలో కలిగే రోగాలకు మన ఇంట్లోనే వైద్యం ఉంటుంది. కాకపోతే వాటి గురించి తెలుసుకుని పాటిస్తే ఆరోగ్యం మన సొంతం అవుతుంది. రోగాలతో బాధపడే బదులు వాటిని దూరం చేసే ఇలాంటి చిట్కాలు పాటించి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.






