
మనలో చాలా మంది నోటి దుర్వాసనతో బాధపడుతున్నారు. దీంతో వారు నలుగురిలో నవ్వడానికి కూడా ఇష్టపడరు. ఎక్కడ నోరు వాసన వస్తుందోనని దగ్గర పెట్టుకుని ఉంటారు. నోరు ఎందుకు దుర్వాసన వస్తుంది? మనం తిన్న పదార్థాలు పళ్ల సందుల్లో ఇరుక్కుపోవడం వల్ల దుర్వాసన సమస్య ఎదురవుతుంది. దీనికి సరైన పరిష్కారాలు సైతం ఉన్నాయి.
నోటి దుర్వాసన రాకుండా ఉండాలంటే ఒక గ్లాసు నీటిలో పటికను వేసి ఇరవై నిమిషాలు ఉంచి తరువాత కాటన్ బట్టతో ఫిల్టర్ చేసి గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి. రోజు ఉదయం పళ్లు తోముకున్న తరువాత ఈ నీటితో పుక్కిలిస్తే మంచి ఫలితం ఉంటుంది.
బేకింగ్ సోడాతో కూడా నోటి దుర్వాసనను దూరం చేసుకోవచ్చు. ఒక గ్లాసు నీటిలో అర టీ స్పూన్ బేకింగ్ పౌడర్ కలుపుకుని దీంతో రోజుకు రెండు సార్లు శుభ్రం చేసుకుంటే నోటి దుర్వాసన బాధించదు. లవంగం కూడా నోటి దుర్వాసనను లేకుండా చేస్తుంది. నోటి దుర్వాసనను వదిలించుకోవడానికి లచ్చి లవంగాలను నమిలితే ప్రయోజనం కనబడుతుంది.
ఇలా మనకు అందుబాటులో ఉన్న చిట్కాలు ఉపయోగించి నోటి దుర్వాసనను దూరం చేసుకోవాలి. లేకపోతే ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ నేపథ్యంలో నోటి దుర్వాసన వల్ల కలిగే కష్టాలను అధిగమించేందుకు వీటిని పాటించి పరిష్కారాలు పొందవచ్చు.