
ప్రస్తుతం వేసవి కాలం కావడంతో ఎండలు మండిపోతున్నాయి. దీంతో ఆహారం విషయంలో జాగ్రత్తలు పాటించాలి. సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తీసుకోవడం మంచిది. లేకపోతే గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు బాధిస్తాయి. ఈ నేపథ్యంలో మనం సరైన ఆహారాలు తీసుకోవడానికే మొగ్గు చూపాలి. నీరు ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఎండాకాలంలో ఫ్రైడ్ ఆహారాలు తీసుకోవద్దు. వేసవిలో వేయించిన పదార్థాలు తినడం వల్ల నీరసం, కడుపులో అసౌకర్యం కలుగుతుందని చెబుతారు. కారం ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోకూడదు. కారం వల్ల ఉష్ణోగ్రత పెరిగి చెమటలు పడతాయి. వేసవిలో తేలికపాటి రుచులు కావాలి.
కూల్ డ్రింకులకు దూరంగా ఉండాలి. ఇందులో చక్కెర కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఆరోగ్యం పాడవుతుంది. వీటికి బదులు కొబ్బరిబొండాలు తాగడం మంచిది. హెర్బల్ టీ తాగడం వల్ల కూడా మంచి ఫలితాలు ఉంటాయి. తాజా పండ్ల రసాలు కూడా సురక్షితమే.
మాంసాహారాలకు కూడా దూరంగా ఉండాలి. వీలయితే చికెన్, చేపలు, ఆకుకూరలు తినాలి. దీంతో జీర్ణక్రియ దెబ్బతినకుండా ఉంటుంది. శరీరంలో వేడి లేకుండా చేస్తాయి. ఇలా ఎండాకాలంలో మనకు వేడి చేసే వాటికి దూరంగా ఉండి చల్లని వాటిని తీసుకోవడం శ్రేయస్కరం.