
ఈ రోజుల్లో పీరియడ్స్ సమస్య చాలా మందిని వెంటాడుతుంది. సమయానికి నెలసరి రాకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటుంటారు. ప్రతి నెల సరైన సమయంలో రుతుక్రమం రాకపోతే ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. దీంతో మునుముందు పీసీవోడీ సమస్య ఎదురవుతుంది. స్త్రీలు గర్భం దాల్చే అవకాశాలు కూడా తక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
మానసిక ఒత్తిడి కారణంగా నెలసరి సక్రమంగా రాదని అంటున్నారు. వీలైనంత వరకు ఒత్తిడిని తగ్గించుకోవాలి. లేకపోతే నెలసరి ఇబ్బంది పెడుతుంది. ఒత్తిడిని అధిగమించేందుకు ప్రయత్నించండి. లేకపోతే సమస్యలు పెరుగుతాయి. రుతుక్రమం సక్రమంగా వచ్చేందుకు అవకాశాలు కల్పించుకోవాలి.
జలుబు, దగ్గు, ఫ్లూ వంటి వ్యాధులు ఉంటే కూడా రుతుస్రావం ఆలస్యం అవుతుంది. పీరియడ్స్ సకాలంలో రాకపోవడానికి ఇవి కూడా కారణాలే కావచ్చు. అందుకే ఇవి లేకుండా చూసుకోవడం మంచిది. ఇలాంటి సమస్యల నుంచి ఉపశమనం పొందితేనే నెలసరి సక్రమంగా వస్తుంది.
అధిక బరువు ఉన్న వారికి కూడా రుతుస్రావం సరైన సమయంలో రాదు. పీరియడ్స్ సరిగా వచ్చేందుకు ఊబకాయం కూడా ఒక కారణంగా ఉంటుంది. సాధ్యమైనంత వరకు అధిక బరువు పెరగకుండా చూసుకోవడమే మంచిది. ఇలా మన అలవాట్లను మార్చుకుని మనకు రుతుస్రావం సరిగా వచ్చేలా చూసుకోవడం చాలా మంచిది.