
ఇటీవల కాలంలో అందరిని వేధిస్తున్న సమస్య జుట్టు రాలడం. దీంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మగవారికైతే బట్టతల సహజం. కానీ ఆడవారికి వెంట్రుకలే అందం. ఒత్తైన జడ ఉంటే వారి అందం మరింత ఇనుమడిస్తుంది. అందుకే జుట్టు రాలకుండా ఉండాలంటే ఏం చేయాలనే దానిపై ఎన్నో మార్గాలు అన్వేషిస్తుంటారు. జుట్టు రాలడం, తెల్లబడటం సమస్యల నుంచి ఉపశమనం పొందేందుకు నానా మార్గాలు వెతుకుతుంటారు. కానీ ఫలితం ఉండదు.
ఈ నేపథ్యంలో జుట్టు రాలడం సమస్య పోషకాహార లోపం వల్లే వస్తుందని చాలా మందికి తెలియదు. ఆధునిక ఆహార అలవాట్లు మన జుట్టును నిర్వీర్యం చేస్తున్నాయి. పూర్వం రోజుల్లో జుట్టుకు ఆముదం రాసేవారు. దీంతో వారికి డెబ్బయి ఏళ్లయినా జుట్టు నెరవకుండా ఉండేది. ఇప్పుడు పాతికేళ్లకు అన్ని అయిపోతున్నాయి. మసలి తనం వచ్చినట్లుగా కనిపిస్తున్నారు.
దీంతో నలుగురిలో తిరగలేకపోతున్నారు. సిగ్గుతో చచ్చిపోతున్నారు. తమ దుస్థితికి కారణాలేంటని మాత్రం తెలుసుకోవడం లేదు. దేవుడు మాకు అన్యాయం చేశాడని తిట్టుకుంటున్నారు. కానీ మన తప్పిదాల వల్లే మనకు జుట్టు రాలడం, తెల్లబడటం సమస్యలు వస్తున్నాయనే సంగతి తెలుసుకోవడం లేదు. దీంతో సమస్య ఓ చోట ఉంటే పరిష్కారం మరోచోట వెతికినట్లుగా చేస్తున్నారు.
జుట్టును పెంచే ఆహారాలేంటో తెలుసా. కొబ్బరి మన జుట్టు పెరిగేందుకు సాయపడుతుంది. రోజు మనం కొబ్బరి తినడం వల్ల మనకు జుట్టు రాలే సమస్య ఉండదు. ఇంకా నువ్వులు కూడా మంచి పోషకాలు ఉన్న ఆహారమే. ఇందులో ఉండే ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు రాలే సమస్యను దూరం చేస్తాయి. అందుకే నువ్వులు రోజువారీ ఆహారంలో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు అందుతాయి.
చియా విత్తనాలు కూడా జుట్టు రాలే సమస్యను అరికడతాయి. ఇందులో ఉండే మెగ్నిషియం జుట్టు రాలే సమస్యను నివారిస్తాయి. జుట్టు ఒత్తుగా పెరిగేందుకు ఇవి సాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలే సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు. జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు మెంతి కూర తినడం కూడా మంచిదే. మెంతి విత్తనాలు రోజుకు కొన్ని తింటే ఈ సమస్య రాకుండా ఉంటుంది.
బాదం, పిస్తా, జీడిపప్పు, జనపనార గింజలు, అవిసె గింజలు, గుమ్మడి గింజలు, పుచ్చకాయ గింజలు, పొద్దు తిరుగుడు గింజలు కూడా జుట్టు రాలే సమస్యకు మంచి పరిష్కారం చూపుతాయి. దీంతో రోజు వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. వీటిని రోజు వారీ ఆహారంలో చేర్చుకుంటే జుట్టు రాలే సమస్యకు చక్కని పరిష్కారం లభిస్తుంది.






