32.7 C
India
Friday, April 19, 2024
More

    వేసవిలో చలువ చేసే ఆ ఐదు పానీయాలు ఏంటో తెలుసా?

    Date:

    summer drinks
    summer drinks
    వేసవి కాలం వచ్చేసింది. భానుడి భగభగలు భయపెడుతున్నాయి. కాలు బయట పెడదామంటే జంకుతున్నారు. ఎండ వేడికి తట్టుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వడదెబ్బ ముప్పు నుంచి రక్షించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించాల్సిందే. శరీరాన్ని చల్లబరచుకునే క్రమంలో కొన్ని పానీయాలు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనికి మనం పెద్దగా కష్టపడాల్సిందేమీ లేదు. వీటిని తాగడం వల్ల మనకు ఎన్నో లాభాలు కలుగుతాయని చెబుతుంటారు.

    మజ్జిగ

    వేసవిలో ఎండ తీవ్రతను తట్టుకోవడానికి అద్భుతమైన పానీయాల్లో మజ్జిగ మొదటి స్థానంలో ఉంటుంది. ఎండాకాలంలో క్రమం తప్పకుండా మజ్జిగ తీసుకుంటే శరీరం హైడ్రేడ్ కాకుండా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జీర్ణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ఎసిడిటి, మలబద్ధకం సమస్యలను దూరం చేస్తుంది. ఇందులో కాస్త ఎండిన అల్లం లేదా మిరియాలు వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది.

    చెరుకు రసం

    ఎండాకాలంలో వేడిని భరించడానికి ఉపయోగించే పానీయాల్లో చెరుకు రసం కూడా ఒకటి. దీంతో పలు రోగాలకు మందులా పనిచేస్తుంది. చెరుకు రసం తరచుగా తీసుకుంటే శరీరానికి చల్లదనం కలుగుతుంది. శరీరానికి అవసరమైన శక్తిని ఇస్తుంది. దీంతో శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా కాపాడుతుంది. చెరుకురసంలో పుదీనా, నిమ్మరసం కలుపుకుని తాగితే బాగుంటుంది.

    జీరా డ్రింక్

    జీలకర్రతో తయారు చేసే పానీయం ఇది. వేడి నుంచి ఉపశమనం కోసం దీన్ని తయారు చేసుకుంటాం. ఇది శరీరానికి చలువ చేస్తుంది. జీలకర్ర అజీర్తి సమస్యలను దూరం చేస్తుంది. గ్యాస్, ఎసిడిటి రాకుండా నిరోధిస్తుంది. గ్లాసు నీటిలో జీలకర్ర వేసుకుని అందులో కాసింత ఉప్పు, కారం చేర్చుకుని తాగితే అధిక వేడి సమస్యను పోగొడుతుంది.

    సోంపుతో..

    మనం ఆహారం తిన్న తరువాత జీర్ణం కోసం కాసిన్ని సోంపు గింజలు నోట్లో వేసుకుంటాం. దీంతో మనం తిన్న ఆహారం జీర్ణమైపోతుంది. వేసవి కాలంలో సోంపుతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. సోంపు టీ తాగడం వల్ల ఎండ బారి నుంచి రక్షించుకోవచ్చు. రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. బాలింతలకు పాలు బాగా పడటానికి కూడా ఇది దోహదపడుతుంది.

    పుచ్చకాయ

    దీన్ని వాటర్ మిలన్ అని పిలుస్తారు. ఇందులో తొంభైశాతం నీరే ఉంటుంది. అందుకే వేసవి కాలంలో అందరు తినాల్సిన పండు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లతో మన ఆరోగ్యానికి ఎంతో మేలు. వేసవి కాలంలో పుచ్చకాయనునేరుగా తినొచ్చు లేదా జ్యూస్ చేసుకుని తాగొచ్చు. దీంతో శరీరం చల్లబడుతుంది. ఎండ వేడిమిని ఇది నివారిస్తుంది. వడదెబ్బ సోకకుండా రక్షణ కల్పిస్తుంది.

    Share post:

    More like this
    Related

    Vasantha Krishnaprasad : వైకాపా పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు : మైలవరం టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్

    Vasantha Krishnaprasad : వైసీపీ పాలనపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని...

    Nominations in AP : ఏపీలో నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ

    అభ్యర్థితో కలిపి 5గురుకి మాత్రమే అనుమతి రాజకీయ ప్రకటనలకు అనుమతి...

    KCR : కవిత అరెస్టుపై స్పందించిన కేసీఆర్

    KCR React Kavitha Arrest : కవిత అరెస్టుపై తొలిసారి కెసిఆర్...

    Mango Tree : మామిడి చెట్టుకు ఒకే చోట 22 కాయలు

    Mango Tree : కరీంనగర్ జిల్లాలో ఓ మామిడిచెట్టు ఒకే కొమ్మకు...

    POLLS

    [yop_poll id="2"]

    Latest News

    - Download the UBlood app here -

    Photos

    - Advertisement -

    Popular

    More like this
    Related

    Cool Drinks : శీతల పానీయాలపై WHO ఆందోళన

    Cool Drinks :  క్యాన్సర్ కు దారి తీసే ముప్పు ఉందని...

    Reduce Heat : రాత్రి పడుకునే ముందు ఈ డ్రింక్స్ తాగితే వేడి తగ్గుతుంది

    Reduce heat : ఎండాకాలంలో విపరీతంగా దంచి కొడుతున్నాయి. విపరీతమైన చెమట...

    Soft Drinks : శీతల పానీయాలు తాగితే ఎంత నష్టమో తెలుసా?

    soft drinks : శీతల పానీయాలు తాగడం వల్ల ఆరోగ్యానికి ముప్పే....

    Eating Curd : ఎండాకాలంలో పెరుగు తింటే వేడి చేస్తుందా?

    Eating curd : ఎండాకాలంలో చాలా మంది పెరుగు తింటారు. కానీ...