
good sleep : నిద్ర మనకు చాలా ముఖ్యం. తగినంత నిద్ర లేకపోతే దాని ప్రభావం మన ఆరోగ్యం మీద పడుతుంది. దీంతో ఇబ్బందులు వస్తాయి. ఆధునిక కాలంలో చాలా మంది నిద్ర పోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. గాఢనిద్ర పట్టకపోతే మన శారీరక వ్యవస్థ దెబ్బతింటుంది. ఫలితంగా ఎన్నో తిప్పలు పడాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో నిద్ర కోసం మనం ఏం చేయాలో చూద్దాం.
మనకు మంచి నిద్ర పట్టాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. దీంతో సరైన నిద్ర పడుతుంది. మన ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. నిద్ర పోవడానికి గంట ముందు నుంచి ఏ పనులు చేయకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. దీంతో మనకు వెన్నంటుకుంటేనే కన్నంటుకుంటుంది. సెల్ ఫోన్ ను సాధ్యమైనంత వరకు దూరంగా పెట్టుకోవాలి. వీలైతే స్విచాఫ్ చేయడం ఇంకా మంచిది.
రాత్రి భోజనం తొందరగా చేయాలి. ఏడు గంటలకు ముందే మనం డిన్నర్ చేస్తే అది పది గంటల వరకు కడుపు శుభ్రంగా చేస్తుంది. దీంతో మనకు మంచి నిద్ర పడుతుంది. తిన్న వెంటనే పడుకోవడం చెడు అలవాటు. తిన్న తరువాత ఓ అరగంట పాటు వాకింగ్ చేయాలి. దీంతో మనం తిన్న ఆహారం త్వరగా జీర్ణం అయ్యే అవకాశాలుంటాయి.
తలకు అరికాళ్లకు నువ్వుల నూనె రాసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. పడుకునే ముందు పాలల్లో సోంపు వేసి బాగా మరిగించి తాగితే తొందరగా నిద్ర రావడానికి ఆస్కారం ఉంటుంది. ఓ మంచి పుస్తకం చదివితే కూడా నిద్ర వస్తుంది. ఇంకా మంచి సంగీతం వింటే కూడా మనకు నిద్ర రావడానికి అవకాశాలెక్కువగా ఉంటాయి.