bath మనం రోజు కాలకృత్యాలు తీర్చుకుంటాం. ఇందులో భాగంగా ముఖం కడుక్కోవడం, స్నానం చేయడం, ఒకటి రెంటికి వెళ్లడం లాంటివి చేస్తుంటాం. ఇవన్ని పొద్దున లేచాకే పూర్తి చేస్తాం. మనం స్నానం చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందనే విషయం మనకు తెలియదు. తెల్లవారు జామున నాలుగు గంటల నుంచి ఐదు గంటల లోపు స్నానం చేయడం ఉత్తమంగా చెబుతారు.
ఉదయం నాలుగు గంటలకు చేసేది రుషి స్నానం, ఐదు గంటలకు చేసేది గంధర్వ స్నానం, ఆరు గంటలకు చేసేది దేవ స్నానంగా చెబుతారు. అంత పొద్దున అసలు లేవడమే కుదరదు. స్నానం అంటే కష్టమే. కానీ స్నానం అలా చేయడం వల్ల మనకు మంచి ఫలితాలు వస్తాయని అంటుంటారు. ఇది మంచి ఫలితాలు ఇస్తుందట. ఆరు గంటల నుంచి ఏడు గంటల మధ్య చేసే స్నానం మానవ స్నానంగా పేర్కొంటారు.
ఆదివారం తలస్నానం చేస్తే తాపం పోతుంది. సోమవారం తల స్నానం చేస్తే అందం పెరుగుతుంది. మంగళవారం తల స్నానం చేస్తే అమంగళం. బుధవారం తల స్నానం చేస్తే వ్యాపారం బాగా జరుగుతుంది. గురువారం తలస్నానం చేస్తే ధన నష్టం కలుగుతుంది. శుక్రవారం చేస్తే అనుకోని ఆపదలు వస్తాయి. శనివారం తలస్నానం చేయడం వల్ల భోగాలు సిద్ధిస్తాయి.
తూర్పు వైపు తలపెట్టి నిద్రపోతే సుఖం, సంతోషం కలుగుతాయి. ఉత్తర దిశకు తలపె ట్టి నిద్రపోతే అనారోగ్యం, మరణం సంభవిస్తాయి. ఈశాన్యం వైపు తలపెట్టి నిద్ర పోతే కలహాలు, రుణాలు పెరుగుతాయి. దక్షిణ దిశకు తలపెట్టి నిద్రపోవడం వల్ల కీర్తి, విద్య, శాంతి వస్తాయి. ఆగ్నేయం వైపు తల పెట్టి నిద్ర పోతే రుణబాధలు వేధిస్తాయి. నైరుతి వైపు తలపెట్టి పడుకుంటే అభివృద్ధి జరుగుతుంది. వాయువ్యం వైపు తలపెట్టి పడుకోవడం వల్ల పిచ్చి ఆలోచనలు ఎక్కువవుతాయి.