
Drinking lemon juice benefits : మనం ఆరోగ్యం కోసం ఎన్నో చర్యలు తీసుకుంటాం. వేసవి కాలంలో అధిక వేడికి మన శరీరం కూడా వేడిగా ఉంటుంది. ఆ వేడిని తగ్గించుకునేందుకు మనం నానా ప్రయత్నాలు చేస్తుంటాం. గోరువెచ్చని నీటిలో ఓ చెక్క నిమ్మరసం పిండుకుని తాగితే ఎంతో ఉపశమనం కలుగుతుంది. నీళ్లలో నిమ్మరసం పిండుకుని తాగినప్పుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది. దీంతో చాలా రోగాలు రాకుండా పోతాయి. అంతటి మహత్తరమైన చిట్కాను అందరు ఉపయోగించుకుని లాభం పొందవచ్చు.
కాలేయ వ్యాధులను దూరం చేస్తుంది. దాని జీవిత కాలాన్ని పెంచేందుకు పాటుపడుతుంది. ఇలా నిమ్మలో ఔషధ గుణాలు చాలా ఉన్నాయి. మానసిక ఒత్తిడిని తగ్గించి శరీరానికి కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది. ఇలా నిమ్మరసం తాగడం వల్ల మన ఒంట్లో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఫలితంగా మన శరీర భాగాలు పాడవకుండా కాపాడుతుంది.
ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటంతో ఇది మన శరీరానికి మేలు చేస్తుంది. పంటి నొప్పులను తగ్గించే శక్తి దీనికి ఉంది. అందుకే ఈ సమస్యతో బాధపడేవారు నిమ్మ నీళ్లను నమలినట్లు చేసినా ప్రయోజనం ఉంటుంది. కలుషిత నీరు తాగితే గొంతు నొప్పి వస్తుంది. నిమ్మరసం ఆ సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
నిమ్మలో విటమిన్ సి ఉంటుంది. అందుకే వయసు మీద పడుతున్న శరీరం ముడతలు పడకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది యాంటీ సెప్టిక్ గా పనిచేయడం వల్ల మేని ఛాయ తగ్గదు. దీంతో మనకు ముసలి తనం వచ్చిందనే ఆలోచన కూడా రాకుండా చేస్తుంది. ఇలా నిమ్మరసం మనకు ఎన్నో రకాల మేలు చేస్తుందనడంలో సందేహం లేదు.