
Watermelon : వేసవి కాలంలో పుచ్చకాయ తింటే ఎంతో మేలు. ఇందులో తొంభై శాతం నీరే ఉంటుంది. దీని వల్ల ఎంతో ఉపశమనం లభిస్తుంది. ఈనేపథ్యంలో పుచ్చకాయ తినడం వల్ల మన ఆరోగ్యం మెరుగుగా చేస్తుంది. దీంతో ఎండాకాలంలో దీన్ని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. పుచ్చకాయ తినడం వల్ల మనకు ఆరోగ్యం బాగుంటుంది. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు అందరు తినేందుకు మొగ్గు చూపుతారు.
శరీరం డీ హైడ్రేషన్ కు గురికాకుండా చేస్తుంది. ఒంట్లో నీరు తగ్గకుండా చూస్తుంది. అందుకే పుచ్చకాయ తినడం వల్ల మేలు కలుగుతుంది. శరీరానికి కావాల్సిన విటమిన్లు అందిస్తుంది. పుచ్చకాయలో ఉండే పోషకాల వల్ల మన శరీరానికి ఎన్నో రకాలుగా సాయపడుతుంది. దీని వల్ల మనకు పుచ్చకాయ తినడం వల్ల దేహానికి అన్ని రకాలుగా మేలు కలిగిస్తుంది.
ఈ రోజుల్లో చాలా మంది క్యాన్సర్ బారిన పడుతున్నారు. పుచ్చకాయ తినడం వల్ల దాని నుంచి రక్షణ కలిగిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఇలా మనకు గుండె జబ్బులు రాకుండా చేయడంలో ప్రధాన భూమిక పోషిస్తుంది. అందుకే వేసవి కాలంలో పుచ్చకాయ తిని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది.
జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. చర్మం, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. ఇలా పుచ్చకాయ మనకు పలు వ్యాధుల నుంచి ఉపశమనం కలిగించడంలో ఉపకరిస్తుంది. ఈ క్రమంలో పుచ్చకాయ తినడం సురక్షితం. దీంతో అందరు పుచ్చకాయ తిని వారి ఆరోగ్యాన్ని కాపాడుకుని మంచి రక్షణ వ్యవస్థను మెరుగు పరచుకోవాలి.