
Prevent Rice : మనది వ్యవసాయ దేశం కావడంతో మనం అన్నం తినడానికే ప్రాధాన్యం ఇస్తుంటాం. దీంతో అందులో కార్బొహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్నాయని తెలిసినా తీసుకుంటాం. బియ్యం కిలో రెండు కిలోలు కాకుండా ఒకే సారి అర క్వింటాలో క్వింటలో కొనుగోలు చేస్తాం. బియ్యం బస్తాల్లో పురుగులు ఉండటం సహజమే. బియ్యం పురుగులు పట్టకుండా ఉండాలంటే ఏం చేయాలో కొన్ని చిట్కాలు ఉన్నాయి.
బియ్యంలో పురుగులు లేకుండా పోవాలంటే 10 లవంగాలు తీసుకుని బియ్యం బస్తాలో ఉంచుకుంటే ఫలితం వస్తుంది. వెల్లుల్లి రెబ్బలను పొట్టు తీశాక బయట పడేయకుండా బియ్యంలో కలుపుకుంటే మంచి ఫలితం ఉంటుంది. బిర్యాణీ ఆకుల వాసన పురుగులను, కీటకాలను దూరం చేస్తుంది. బియ్యంలో ఐదారు బిర్యాణీ ఆకులు ఉంచితే ప్రయోజనం కలుగుతుంది.
బియ్యంలో పురుగులు రాకుండా ఉండటానికి నల్ల మిరియాలు ఉపయోగపడతాయి. బియ్యాన్ని ఎండలో ఎండబెడితే పురుగులు, కీటకాలు చచ్చిపోవడం ఖాయం. అల్లంతో కూడా పురుగులను దూరం చేయొచ్చు. అల్లం ముక్కలు ఒక పాత్రలో వేసి బియ్యం పైన పెడితే మంచి ఫలితాలు వస్తాయి. పురుగులు, కీటకాలు దరిచేరకుండా పోతాయని చెబుతున్నారు.
ఇలా ఈ చిట్కాలు ఉపయోగించి బియ్యంలో పురుగులు ఉండకుండా చూసుకుంటే ప్రయోజనం. బియ్యానికి పురుగులు పడితే వండుకోవడానికి వీలుండదు. ఇలా బియ్యాన్ని ఫ్రెష్ గా ఉంచుకోవాలి. అప్పుడే మనం తినడానికి వీలుంటుంది. పురుగు పట్టిన బియ్యాన్ని వాడుకుంటే మనకు ఆరోగ్యం దెబ్బతింటుంది. అందుకే బియ్యం పురుగు పట్టకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే.