
Tomatoes : మనం కూరల్లో విరివిగా వాడుకునే కాయ టమాట. దీంతో మనకు ఎన్నో లాభాలున్నాయి. ఎర్రగా ముద్దుగా కనిపించే టమాట లేనిదే ఏ కూర ఉండదు. అన్నింట్లోకి దీన్ని వేసుకునే వండుకుంటాం. లేకపోతే రుచి ఉండదు. ఏ రకమైన కాయలతో కూర వండినా అందులో టమాట చేరాల్సిందే. అంతటి విలువ దీనికి ఉంటుంది. అందుకే అన్నింట్లోనూ టమాట వేసుకుని కూర చేసుకుంటాం.
టమాట తినడం వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఇది జీర్ణక్రియలను మెరుగుపరుస్తుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావాలంటే టమాటతోనే సాధ్యం. ఇందులో ఉండే ఫైబర్ మన జీర్ణవ్యవస్థను క్రియాశీలకంగా చేస్తుంది. మనం తిన్న ఆహారాలు జీర్ణం కావడానికి ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది అందుకే అన్ని కూరల్లో దీన్ని వేసుకుంటాం.
టమాట జ్యూస్ తాగడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది. గుండె ఆరోగ్యం బాగుండాలంటే చెడు కొలెస్ట్రాల్ ఉండకూడదు. అలా మన గుండెకు తెలియకుండానే టమాట మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, లుటీన్ ఉండటం వల్ల కంటి సమస్యలు రాకుండా నిరోధిస్తుంది. ఇన్ని రకాల లాభాలు కలిగిస్తున్నందున టమాట మన ఆహారంలో భాగంగా చేసుకోవడమ మంచిదే.
ఇందులో ఉండే ఫైటో న్యూట్రియన్లు రక్తనాళాలు గడ్డకట్టకుండా చూస్తాయి. టమాట జ్యూస్ తాగడం వల్ల కూడా మనకు ఎన్నో లాభాలుంటాయి. రోజు ఉదయం పూట ఓ గ్లాసు టమాట జ్యూస్ తాగి రోగాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇలా టమాటతో మనకు కలిగే ప్రయోజనాల కారణంగా దీన్ని మనం క్రమం తప్పకుండా తీసుకుని లాభాలు పొందాల్సిన అవసరం ఎంతైనా ఉందని గుర్తించాలి.