
Pomegranate Juice : మనకు ఆరోగ్యాన్ని ఇచ్చే పండ్లలో దానిమ్మ ఒకటి. ఇందులో ఉండే పోషకాల వల్ల పలు రకాల ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే రోజువారీ ఆహారంలో దీన్ని చేర్చుకోవడం మంచిది. దీని గింజలను తీసుకుని మనకు మేలు కలిగించేలా చేసుకోవడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో దానిమ్మ వాడుకోవడం ఉత్తమం. ఆరోగ్యాన్ని కాపాడే పండ్లలో ఇది ప్రధానమైనది.
ఇందులో ఐరన్, విటమిన్ సి, ఇ, కె, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో మంచి లాభాలున్నాయి. ఆరోగ్యాన్ని కాపాడే దానిమ్మ జ్యూస్ లో ఎల్లారిటానిన్స్ అనే పాలీపినాల్స్ ఉంటాయి. ఒత్తిడిని తగ్గించి నరాలకు బలం చేకూరుస్తుంది. ఇందులో ఉండే మెగ్నిషియం, నరాల ఆరోగ్యం మెరుగుపడుతుంది. దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల కార్డిసాల్ అనే హార్మోన్ స్థాయిలు అదుపులో ఉంటాయి.
దానిమ్మ జ్యూస్ రక్తహీనతను దూరం చేస్తుంది. చర్మ ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. ముసలి చాయలు కనిపించకుండా కాపాడుతుంది. నీరసం, బలహీనత, నిస్సత్తువ వంటి సమస్యలతో బాదపడేవారు దీని జ్యూస్ తాగితే ఉపశమనం లభిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని బాగు చేస్తుంది. రక్తపోటును అదుపులో ఉంచుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.
రోజు ఉదయం ఒక గ్లాస్ దానిమ్మ జ్యూస్ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. ఇలా దానిమ్మ వాడుకుని మన ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చు. దీని వల్ల ఎన్నో లాభాలున్నాయి. ఇది లైంగిక వాంఛలను కూడా ప్రేరేపిస్తుంది. అందుకే దీన్ని రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకోవడం ఉత్తమం. దానిమ్మతో మనకు లభించే లాభాలతో దీన్ని తీసుకోవాలి.