ప్రతీ రోజూ శృంగారంలో పాల్గొనవచ్చా ? శృంగారంలో రోజుకి ఎన్నిసార్లు పాల్గొనాలి ? ఎక్కువసార్లు పాల్గొంటే అనారోగ్యమా ? ఇలా పలు రకాల అనుమానాలు కొందరిని తొలిచేస్తుంటాయి. అయితే వాటికి డాక్టర్లు ఇస్తున్న సలహా ఏంటో తెలుసా ? చాలా సింపుల్ ……. ఓపిక ఉంటే రోజులో ఎన్నిసార్లు అయినా శృంగారంలో పాల్గొనవచ్చు అని తేల్చి పడేసారు.
అవును శృంగారంలో పాల్గొంటే జంటకు ఓపిక ఉండాలే కానీ రోజుకు నాలుగైదుసార్లు అయినా పాల్గొనవచ్చు. అయితే కొత్తగా పెళ్లి అయిన సమయంలో ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనాలనే కోరిక, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. దాంతో ఆ సమయంలో ఓపిక ఉంటే ఎన్నిసార్లు అయినా సరే పాల్గొనవచ్చు.
పైగా శృంగారంలో పాల్గొనే జంటకు మరింత శక్తి , ఉత్సాహం వెల్లివిరియడం ఖాయం. శృంగారంలో పాల్గొనడం వల్ల ఫీల్ గుడ్ హార్మోన్స్ విడుదల అవుతాయి దాంతో మరింత ఉత్సాహంగా ఉంటారని , పైగా శృంగారం మంచి ఎక్సర్ సైజ్ కూడా అని అంటున్నారు డాక్టర్లు. శృంగారంలో ఫలానా సమయంలోనే పాల్గొనాలి అనే నియమం ఏదీ లేదని , అయితే ఎక్కువగా రాత్రి శృంగారానికి మాత్రమే మహిళలు ఆసక్తి చూపుతారని వెల్లడించారు డాక్టర్లు.