
Dry grapes : ఈ రోజుల్లో రక్తహీనత సాధారణం. దీంతో ఎన్నో ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో రక్తహీనత సమస్యతో చాలా మంది సతమతమవుతున్నారు. ఆరేళ్ల పిల్లల నుంచి అరవై ఏళ్ల వయసు వారికి రక్తహీనత ఎన్నో సమస్యలు తెస్తుంది. దీన్ని దూరం చేసుకోవాలంటే కొన్ని రకాల చర్యలు తీసుకోవాలి. రక్తహీనత సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. దీని నుంచి రక్షించుకోవాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి.
రక్తహీనత సమస్యకు ఎండుద్రాక్షతో చెక్ పెట్టొచ్చు. ఎండుద్రాక్షలో పొటాషియం అధికంగా ఉంటుంది. కాల్షయం కూడా ఉంటుంది. దీని వల్ల ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఎండు ద్రాక్షలో విటమిన్ సి ఉంటుంది. నల్ల ఎండు ద్రాక్షలో ఐరన్ దాగి ఉంటుంది. దీంతో వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా రక్తహీనత సమస్య నుంచి దూరం కావడానికి ఇవి దోహదపడతాయి.
నల్ల ఎండుద్రాక్షలో పొటాషియం రక్తంలో సోడియం మోతాదులను తగ్గిస్తుంది. వీటిని తినడం వల్ల రక్తపోటు తగ్గిపోతుంది. గుండె ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేస్తుంది. గుండెకు రక్తసరఫరా సాఫీగా సాగుతుంది. ఇందులో ఐదు చెట్ల రసాయనాలు ఓలియానోలిక్ యాసిడ్ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటంతో పళ్లు పుచ్చిపోకుండా కాపాడతాయి.
ఎండు ద్రాక్ష మహిళల్లో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తాయి. అజీర్తి సమస్యను దూరం చేస్తాయి. బరువు తగ్గడానికి దోహదం చేస్తాయి. ఇలా ఎండు ద్రాక్షలో ఎన్నో రకాల లాభాలు ఉండటంతో వీటిని తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. రక్తహీనత సమస్యను తగ్గించుకోవాలి. ఆరోగ్యకరమైన శరీరం కోసం ఎండు ద్రాక్షలను వాడుకోవడం మంచిది.