
మనకు తరచుగా తలనొప్పి వస్తుంటుంది. దీన్ని మైగ్రేన్ తలనొప్పి రావడం సహజమే. సరైన తిండి లేకపోవడం, నిద్రరాకపోవడం, ఒత్తిడి వల్ల ఇలాంటి మైగ్రేన్ తలనొప్పికి కారణాలుగా నిలుస్తాయి. దీని నుంచి బయట పడేందుకు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. జీవనశైలిని మార్చుకోవాలి. సమయానికి తినడం, సరైన సమయంలో నిద్ర పోవం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి.
మైగ్రేన్ తలనొప్పి సమస్యతో బాధపడేవారు మద్యం తీసుకోకూడదు. రెడ్ వైన్ ను సైతం తాగకూడదు. కాఫీ, టీలు మానేయాలి. మద్యం, కాఫీ తాగే అలవాటు ఉంటే కెఫిన్ మనకు ఈ సమస్య తీవ్రం చేస్తుంది. పులియబెట్టిన ఆహారాలను తీసుకోవద్దు. రొట్టెలు, కూరగాయలు కూడా దూరంగా ఉంచాలి.
ప్రాసెస్ చేసిన మాంసాహారాలను తీసుకోవడం మానేయాలి. చాక్లెట్లు వంటివి తినడం వద్దు. మైగ్రేన్ తగ్గాలంటే తగినన్ని నీళ్లు తాగాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు తీసుకోవాలి. వ్యాయామం చేస్తే మంచిది. జీవనశైలిని మార్చుకోవాలి. దీంతో మైగ్రేన్ సమస్య నుంచి బయట పడొచ్చు.
ఇలాంటి జాగ్రత్తలు పాటించి మైగ్రేన్ ను తగ్గించుకోవాలి. తరచుగా తలనొప్పి వస్తుంటే మనకు ఏ పని చేయడానికి వీలు కాదు. ఈ నేపథ్యంలో మైగ్రేన్ ను తగ్గించుకునే చిట్కాలు పాటించి దాని నుంచి బయటపడేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది.