If men have these symptoms స్త్రీ.. మన జీవితంలో ఈమె ఎన్నో విజయవంతమైన పాత్రలను పోషిస్తుంది అని అందరికి తెలుసు.. స్త్రీ ఒక తల్లిగా, సోదరిగా, భార్యగా, స్నేహితురాలిగా, కోడలిగా, కూతురుగా, అత్తగా ఇలా చెప్పుకుంటే పోతే మన జీవితంలో స్త్రీ పాత్ర చాలా గొప్పది.. తాను లేకపోతే ఈ సృష్టే ఉండదు.. ఈ ప్రపంచం ఆగిపోతుంది..
ఒక స్త్రీ తన ఇష్టాలను పక్కన పెట్టి మరీ తండ్రి కోసం, భర్త కోసం ఆ తర్వాత కొడుకు కోసం ఇలా కుటుంబం లోని అందరికి ప్రాధాన్యత ఇస్తుంది.. తన వారి కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంది. మరి అలాంటి ఒక స్త్రీ ఒక పురుషుడిని జీవితాంతం ప్రేమించాలి అంటే ఒక పురుషుడు ఏం చేయాలి? ఈ ప్రశ్నకు ఒక యూజర్ చెప్పిన సమాధానంకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే..
భార్గవి కుర్మదాసు అనే యూజర్ ఒక స్త్రీ నిన్ను ఎప్పటికి ప్రేమించాలి అంటే ఏం చేయాలి? అనే ప్రశ్నకు ఒక భార్యను దృష్టిలో ఉంచుకుని ఆమె సమాధానం తెలిపింది.
ముందుగా మగవాడు భర్త తన భార్య ఫీలింగ్స్ ను గౌరవించాలి..
భార్యను వేరే వారితో పోల్చకూడదు.. తనని తానుగానే ప్రేమించాలి..
ఆమె మగవాడి నుండి ముందుగా గౌరవాన్ని మాత్రమే ఆశిస్తుంది.
అందరి ముందు ఆమెను కించపర్చే విధంగా అస్సలు మాట్లాడకూడదు..
గొప్పగా చెప్పాల్సిన పని లేదు కానీ కించపరచకూడదు.
మరీ ముఖ్యంగా పిల్లల ముందు తిట్టకూడదు..
పైన చెప్పిన విషయాల్లో భర్త పాటిస్తేనే భార్య ప్రేమిస్తుంది అని కాదు కానీ ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం అనేది ఇస్తేనే మీ పైన ఇంకా ఇష్టం, ప్రేమ, గౌరవం పెరుగుతాయి.. దీని వల్లనే భార్యాభర్తల బంధం మరింత బలపడుతుంది.