
Atibala tree : మన ఊళ్లలో మనకు ఎన్నో రకాల చెట్టు కనిపిస్తాయి. కానీ వాటి విలువ మనకు తెలియదు. అందుకే వాటి గురించి పట్టించుకోం. ఆయుర్వేదంలో మనకు ప్రతి చెట్టూ పనికొస్తుంది. దాని గురించి మనకు తెలియకపో వడంతో అది పిచ్చిచెట్టుగా చూస్తాం. కానీ దాని లాభాలు తెలిస్తే ఆశ్చర్యపోతాం. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మనకు కాలువ గట్ల మీద కనిపించే ఓ మొక్క గురించి తెలుసుకుందాం.
దీన్ని అతిబల అంటారు. స్థానిక భాషలో ముద్ర బెండ అని పిలుస్తారు. తుత్తురు బెండ, దువ్వెనకాయల చెట్టు అని పలు పేర్లతో చెబుతారు. దీని లాభాల గురించి తెలిస్తే షాకే. హిందీలో కంటి అంటారు. గుండె ఆరోగ్యానికి ఇది ఎంతో మేలు. ఈ మొక్క వేర్లను పొడి చేసుకుని జల్లించి నిల్వ చేసుకుని రోజుకు నాలుగు చిటికెల పొడిని బోజనానికి ముందు ఆవు నెయ్యితో కలిపి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
చర్మం మెరిసేలా చేస్తుంది. జ్వరంతో బాధపడుతున్నప్పుడు దీని ఆకులు శుభ్రంగా కడిగి నీటిలో నానబెట్టి తరువాత వాటిని తీసేసి ఆ నీళ్లను కొద్దికొద్దిగా తాగితే శరీరంలో వేడి లేకుండా పోతుంది. పిచ్చికుక్క కరిస్తే దీని ఆకులు 70 గ్రాముల మోతాదులో తీసుకుని తాగించాలి. దీని ఆకుల ముద్దను కాటు వేసిన చోట ఉంచి కట్టు కడితే విషం ఎక్కకుండా ఉంటుంది.
మూత్రపిండాల్లో రాళ్లను కూడా కరిగిస్తుంది. దీని ఆకులను నీళ్లలో వేసి మరిగించాలి. ఆ నీరు సగం వరకు ఆవిరి అయ్యే వరకు మరిగించాలి. తరువాత వడకట్టి అందులో కండ చక్కెర వేసుకుని తాగితే రాళ్లు కరిగిపోతాయి. ఇది మూడు పూటలా తాగాలి. కంటి సమస్యలకు కూడా ఇది దోహదపడుతుంది. కళ్లు మూసుకుని వాటి మీద ఈ నీళ్లు చల్లుకుంటే ఎంతో మంచిది. ఇలా ఈ చెట్టుతో మనకు చాలా రకాల ప్రయోజనాలు కలుగుతున్నాయి.