
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్యల్లో ఆర్థిక సమస్యలే. ఎంత పనిచేసినా తగిన విధంగా డబ్బు సమస్యలు పెరుగుతున్నాయని బాధపడుతున్నారు. ఖర్చులు కూడా అదే విధంగా పెరుగుతున్నాయి. దీని వల్ల మనం ఎంత సంపాదించినా చాలడం లేదు. ఈనేపథ్యంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కాలంటే ఏం చేయాలో తోచడం లేదని బాధపడుతున్నారు.
ఆర్థిక ఇబ్బందులకు వాస్తు దోషాలు కూడా కారణమే కావచ్చు. ఇంట్లో వాస్తు పద్ధతులు సరిగా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. కలహాలు చోటుచేసుకుంటాయి. ఈ క్రమంలో వాటిని అధిగమించాలంటే కొన్ని పరిహారాలు పాటించాలి. వాస్తు దోషాల నివారణకు కొబ్బరికాయ బాగా ఉపయోగపడుతుంది. దేవుడిని కొలిచేందుకు కొబ్బరికాయలను వినియోగిస్తాం. కొబ్బరికాయకు మనం ప్రాధాన్యం ఇస్తుంటాం.
మన ఇంట్లో చేసే పూజల్లో కొబ్బరికాయను వాడతాం. దేవుడికి ఇష్టమైన కొబ్బరికాయను కొట్టి మనల్ని చల్లగా చూడాలని వేడుకుంటాం. వ్రతాలు, పూజలు, శుభకార్యాల్లో కొబ్బరికాయను విరివిగా ఉపయోగిస్తాం. అందుకే కొబ్బరికాయ కొట్టి మనం దేవుడిని ప్రసన్నం చేసుకోవాలని చూస్తాం. కొబ్బరి కాయను మనం అన్ని దేవుళ్లకు మొక్కి కొట్టి మొక్కులు తీర్చుకుంటాం.
కొబ్బరికాయకు నల్లటి కాటుక పెట్టి దాన్ని మన మీద తిప్పుకుని ఇంటి చుట్టూ తిప్పి పారే నీళ్లలో వేయడం వల్ల మనకు కలిగే నరదిష్టి పోతుంది. నరఘోషతో మనకు ఎన్నో ప్రతికూలతలు వస్తాయి. వీటి నుంచి దూరంగా జరగాలంటే ఈ పరిహారం చేయాలి. అప్పుడే మన ఆర్థిక ఇబ్బందులు తీరుతాయి. నరుడి కంటికి నల్ల రాళ్లయినా కరుగుతాయని అంటారు. ఇలాంటి పరిహారాలు చేయడం వల్ల మనకు ఇబ్బందులు లేకుండా పోతాయి.






