
మన ఇంట్లో రకరకాల జంతువులు కీటకాలు ఉంటాయి. వాటిలో బల్లి కూడా ఒకటి. అది మనకు ఎలాంటి హాని చేయదు. కానీ బల్లిని చూస్తేనే భయపడుతుంటారు. ఇల్లన్నాక బల్లులు ఉండటం సహజం. అవి లేకపోతే కీటకాలు మన ఇంట్లో తిష్టవేస్తాయి. అలా వాటిని అవి తింటాయి. ఇలా మనకు మేలు చేస్తాయి. కొందరు బల్లిని అరిష్టంగా భావిస్తారు. కానీ బల్లి అత్యంత శుభ శకునమే అనే సంగతి తెలియదు. పూర్వం రోజుల్లో మన తాతలు బల్లి పలకగానే కిటకిట అనేవారు. అంటే బల్లికి కూడా కొన్ని విషయాలు తెలుసని అర్థం.
మన ఇంట్లో బల్లి కనిపించినట్లయితే మంచిదే అంటారు. మనకు ఏదో శుభ సూచకం జరుగుతుందని చెప్పడానికే బల్లి కనబడుతుందని చెబుతారు. బల్లి ఇం్లో కనిపిస్తే ఏదో కొత్త విషయం జరగబోతుందనే సంకేతం. మన జీవితం మార్పు చెందబోతుందని అర్థం. కొంతమందికి కలలో కూడా బల్లులు కనిపించి కలవరపెడతాయి. బల్లుల బొమ్మలు చూసి కూడా భయపడతారు.
ఇంట్లో బల్లి కనిపించిందంటే మీ ఇల్లు సురక్షితమైనదని అర్థం. ఆ ఇంట్లో ఉండటం వల్ల మీకు ఎన్నో లాభాలు వస్తాయని చెబుతారు. ఇలా బల్లి కనిపిస్తే ఏదో అరిష్టమని చెప్పుకునే బదులు మంచి జరుగుతుందని చెప్పుకోవడమే ఉత్తమం. బల్లి కనిపిస్తే ఏవో కొత్త విషయాలు మనకు రాబోతున్నాయని తెలుసుకోవాలి. బల్లి కనబడటం మంచిదే అని గుర్తించాలి.
కష్టాల్లో ఉన్నప్పుడు బల్లి కనిపిస్తే వాటిని దూరం చేసుకునే సామర్థ్యం మనకు కలుగుతుంది. ఒక్కోసారి మన జీవితంలో ఏవో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. తోక తెగిన బల్లిని చూస్తే మాత్రం జీవితంలో చాలా కష్టాలు పడుతున్నారని సంకేతం. మీ చుట్టు నమ్మక ద్రోహులు చేరి మిమ్మల్ని ఇబ్బందులు పెట్టే సూచనలు ఉంటాయని అర్థం వస్తుంది. ఇలా బల్లితో మనకు లాభాలున్నా కొన్ని నష్టాలు మాత్రం కనిపిస్తాయి.






