
మన శరీరానికి నీరు ఎంతో అవసరం. అన్నం తినకుండా ఉండగలమేమో కానీ నీళ్లు లేకుండా ఉండలేం. రోజుకు కనీసం ఐదారు లీటర్ల నీరు తాగకపోతే శరీరం డీ హైడ్రేషన్ కు గురవుతుంది. దీని వల్ల అనేక సమస్యలు ఏర్పడటం ఖాయం. ఈ నేపథ్యంలో మంచినీరు తాగేందుకు ప్రాధాన్యం ఇవ్వాల్సిందే. లేదంటే ఆరోగ్యం పాడవుతుంది. నీళ్లు సరైన విధంగా తాగకపోతే అవయవాలు దెబ్బతింటాయి.
ఉదయం పూట అందరం పళ్లు తోముకుంటాం. పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగాలని చెబుతుంటారు. దీని వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోతాయని అంటారు. ఎసిడిటి, అజీర్ణం, మలబద్ధకం వంటి సమస్యల నుంచి ఉపశమనం దొరుకుతుంది. అందుకే ఉదయం పళ్లు తోముకునే ముందు నీళ్లు తాగడం వల్ల మనకు ప్రయోజనాలు దక్కుతాయి.
ప్రతి రోజు నిద్ర లేచిన వెంటనే నీళ్లు తాగడం మంచి అలవాటు. ఇది జీర్ణక్రియ సవ్యంగా జరిగేందుకు కారణమవుతుంది. నోటిలో పేరుకుపోయే బ్యాక్టీరియా దూరం అవుతుంది. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇన్ని రకాల లాభాలున్నందున పళ్లు తోముకోవడానికి ముందు నీళ్లు తాగితే మంచిది.
ప్రతిరోజు ఉదయం నీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటు నియంత్రణలోకి వస్తుంది. గోరువెచ్చని నీటిని తీసుకోవడం వల్ల బీపీ అదుపులో ఉంటుంది. మధుమేహానికి కూడా మంచి మందులా పనిచేస్తుంది. రక్తంలో చక్కెరస్థాయి అదుపులో ఉంచేందుకు దోహదపడుతుంది.