
మనకు కంటి నిండా నిద్ర కడుపు నిండా తిండి లేకపోతే బతకడం కష్టం. వరుసగా పదకొండు రోజులు నిద్ర పోకపోతే మనకు మరణమే అని తెలుసా. అంత ప్రమాదకరమైన నిద్రలేమిని దూరం చేసుకోకపోతే మనకు ఇబ్బందులు రావడం సహజమే. ఒక మనిషి సగటున రోజుకు కనీసం 6-8 గంటలు నిద్ర పో వాల్సిందే. లేకపోతే ఆరోగ్యం మందగిస్తుంది.
మనం పడుకునే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. దిండు కింద రెండు మూడు యాలకులు ఉంచుకుంటే మంచి నిద్ర పడుతుంది. దిండు దగ్గర భగవద్గీత పెట్టుకుంటే సుఖమైన నిద్ర పడుతుందని చెబుతారు. అందుకే మనకు నిద్ర బాగా పట్టాలంటే ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది.
పడుకునే సమయంలో మంచం దగ్గర సువాసన వెదజల్లే పువ్వులు పెట్టుకోవాలి. ఇలా చేస్తే మనకు మంచి వాసనతో కంటి నిండా నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. ప్రశాంతత లభిస్తుంది. జీవితంలో సానుకూల శక్తులు వస్తాయి. దీంతో మనకు మంచి నిద్ర పట్టాలంటే ఇవి పాటించడం సురక్షితం.
నిద్ర బాగా పట్టాలంటే మంచం దగ్గర ఇనుప వస్తువు ఉంచుకోవాలి. దీంతో ప్రతికూల శక్తుల ప్రభావం పడుతుంది. గదిలో క్రూర జంతువులు, భయం కలిగించే చిత్రాలు ఉంచుకోవడం వల్ల ఇబ్బందులు వస్తాయి. ఈ నేపథ్యంలో మనం నిద్రించే గదిలో ఇలాంటి వస్తువులు ఉంచుకోకూడదు.