
legumes : మనకు కూరగాయల్లో ఉండే బలం ఎందులోనూ ఉండదు. అందుకే నిత్యం కూరగాయలు తింటే ఆరోగ్యం బాగుంటుంది. ఎలాంటి ఇబ్బందులు రావు. ఈ నేపథ్యంలో రోజువారీ ఆహారంలో కూరగాయలను ఒక భాగంగా చేసుకుంటే ఎంతో మంచిది. చిక్కుకాయలు తీసుకుంటే మన ఆరోగ్య వ్యవస్థ మెరుగుపడుతుంది. ఇందులో ఉండే పోషకాలతో మన ఆరోగ్యం పదిలంగా పదికాలాల పాటు ఉంటుందనడంలో సందేహం లేదు.
జీర్ణ వ్యవస్థను మెరుగు పరచడంలో ఇది ప్రధాన భూమిక పోషిస్తుంది. మనం తిన్న ఆహారాలు త్వరగా జీర్ణం కావాలంటే వీటిని తీసుకోవడం ఎంతో మంచిది. ఇందులో ఉండే పోషకాలు అలాంటివి. అందుకే మన జీర్ణ వ్వవస్థను ప్రభావితం చేసే కూరగాయల్లో ఇది ప్రధానమైనది. అందుకే దీంతో మనకు మేలు కలుగుతుంది. రోజు కూరల్లో తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.
ఈ రోజుల్లో చాలా మంది రక్తహీనతతో బాధపడుతున్నారు. అలాంటి వారికి ఇది మంచి ఆహారం. రోజు తీసుకోవడం వల్ల రక్తహీనతకు చెక్ పెట్టొచ్చు. మెదడు పనితీరును క్రమబద్ధీకరిస్తుంది. మెదడు బాగా పనిచేస్తేనే మన నరాలు చక్కగా పనిచేస్తాయి. లేదంటే నాడీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారుతుంది. దీంతో నరాలు దెబ్బ తింటే సమస్యలొస్తాయి.
ఇందులో ఫైబర్ కంటెంట్ ఉంటుంది. దీంతో ఇది మన ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. చెడు కొలెస్ట్రాల్ ను కరిగిస్తుంది. దంతాలు, గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. నిద్రలేమి సమస్యను దూరం చేస్తుంది. క్యాన్సర్ కారకాలతో పోరాడుతుంది. ఇలా చిక్కుడు మనకు ఎన్నో రకాల సమస్యలను రాకుండా చేస్తుంది. అందుకే దీన్ని ఆహారంగా చేసుకోవడం తప్పనిసరి.