
అరటి పండు అన్ని కాలాల్లో లభిస్తుంది. సీజన్ తో పని లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు దొరుకుతుంది. ఇందులో ఉండే ప్రొటీన్లు మనకు ఎంతో ఉపయోగపడతాయి. మంచి పోషకాలు కలిగిన పండుగా దీనికి గుర్తింపు ఉంది. అరటి పండుతో పాటు దాని పువ్వుకు కూడా మంచి డిమాండ్ ఉంటుంది. అరటి పువ్వులో కూడా కాల్షియం, పొటాషియం, రాగి, మెగ్నిషియం, ఐరన్ వంటి ప్రొటీన్లు ఉంటాయి. అందుకే దీన్ని సలాడ్, సూప్ గా తింటుంటారు.
మధుమేహాన్ని నియంత్రణలో ఉంచేందుకు అరటి పువ్వు మంచి ఆయుధం. శరీరంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. రక్తంలో చక్కెర నిల్వలు పేరుకుపోకుండా చేస్తుంది. అందుకే దీన్ని తినడం వల్ల మంచి ప్రయోజనాలే ఉన్నాయి.
గుండె జబ్బులు, క్యాన్సర్ వంటివి రాకుండా నిరోధిస్తుంది. ఇందులో ఉండే ఫినోలిక్ ఆమ్లం, టానిన్లు, ఫ్లేవనాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ తో పోరాడి ఈ జబ్బులు రాకుండా చేస్తుంది. రోగనిరోధక శక్తి పెంచడంలో సాయపడుతుంది. విటమిన్ సి ఉండటం వల్ల ఆరోగ్య లాభాలున్నాయి.
కిడ్నీల ఆరోగ్యం మెరుగుపరచడంలో కూడా సాయపడుతుంది. మూత్రపిండాల పనితీరు బాగుండేలా చేస్తాయి. కిడ్నీల్లో ఏర్పడే రాళ్లను తొలగిస్తుంది. రక్తహీనతకు చెక్ పెడుతుంది. ఇందులో లభించే ఐరన్ తో రక్తకణాల సంఖ్య పెరుగుతుంది. ఇలా మనకు అరటి పువ్వు అన్ని రోగాలకు మందులా పనిచేస్తుంది.