హాట్ భామ నిధి అగర్వాల్ రేటు అమాంతం పెంచేసింది. ఒక్కో సినిమాకు 50 నుండి 60 లక్షలు మాత్రమే తీసుకునే నిధి అగర్వాల్ తాజాగా ”హీరో” అనే చిత్రంలో కొత్త కుర్రాడి సరసన నటిస్తూ రొమాన్స్ చేసినందుకు గాను ఏకంగా కోటిన్నర రెమ్యునరేషన్ అందుకుందట. ఇప్పుడు ఈ వార్త ఫిలిం నగర్ సర్కిల్లో సంచలనంగా మారింది.
మహేష్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ హీరోగా నటించిన చిత్రం ” హీరో ”. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 15 న విడుదలైంది. గల్లా అశోక్ నటన బాగానే ఉందని హీరోగా పనికొస్తాడని భావిస్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఇక కొత్త కుర్రాడు కాబట్టి అతడితో రొమాన్స్ చేయడానికి హీరోయిన్ నిధి అగర్వాల్ బాగానే డిమాండ్ చేసిందట.
రొమాంటిక్ సీన్స్ అలాగే అందాల ఆరబోత కూడా ఉంది కాబట్టి కోటిన్నర ఇస్తే చేస్తాయా లేదంటే లేదు అని చెప్పడంతో చేసేదిలేక దర్శక నిర్మాతలు ఆ మొత్తం ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేశారట. దాంతో రొమాంటిక్ సీన్స్ లో నటించడమే కాకుండా అందాల ఆరబోతతో కుర్రాళ్ళ గుండెల్లో మంటలు పెట్టింది నిధి అగర్వాల్. ఈ సినిమాకు కోటిన్నర తీసుకుంది కాబట్టి ఇకపై చిత్రాలకు కూడా అదే స్థాయిలో డిమాండ్ చేయొచ్చు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టు కోవాలి అన్న చందంగా నిధి అగర్వాల్ తెలివి తేటలు బాగానే ఉన్న అమ్మాయి అని తెలుస్తోంది. హీరో చిత్రంలో ప్రధాన ఆకర్షణ నిధి అందాలు అనే అంటున్నారు కుర్రాళ్ళు.