
Swinging Legs : మనలో చాలా మందికి చెడు అలవాట్లు ఉంటాయి. వాటిని మానుకోవడం ఎలా అనే దాని మీద ఎన్నో ఆలోచనలు వస్తుంటాయి. ఏవి చెడు అలవాట్లు అంటే మనం కూర్చున్నప్పుడు కొంతమంది కాళ్లు ఊపుతుంటారు. ఇది చెడు అలవాటు అని తెలిసినా మానుకోరు. అసలు కాళ్లు ఎందుకు ఊపుతారు. దాని వల్ల నష్టాలేంటి? ఆ అలవాటును ఎలా మానుకోవాలి.
కుర్చీ మీద కూర్చున్నప్పుడు అనుకోకుండా కాళ్లు వాటంతట అవే ఊగుతుంటాయి. ఇలా ఊగడం అంత మంచిది కాదు. కాళ్లు ఊపడం ఓ వ్యాధిగానే పరిగణిస్తారు. అందుకే కాళ్లు ఊపడం ఓ జబ్బుగా భావిస్తున్న తరుణంలో చాలా మందిలో ఈ అలవాటు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో కాళ్లు ఊపడం అలవాటును మార్చుకునేందుకు చొరవ తీసుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
తగినంత నిద్ర లేకపోవడం, హార్మోన్ల అసమతుల్యత వల్ల కూడా ఇలాంటి అలవాటు ఉంటుంది. నిద్రలేమితో బాధపడే వారికి కూడా ఇలాంటి అలవాటు వస్తుందని చెబుతుంటారు. దీన్ని నివారించుకోవడానికి ఐరన్ మాత్రలు తీసుకుంటే సరి. రాత్రి సమయంలో ఎక్కువ సేపు మొబైల్ చూస్తే కూడా ఈ అలవాటు వస్తుంది. దీని వల్ల దీన్ని దూరం చేసేందుకు చొరవ తీసుకుంటే మంచిది.
కాళ్లు, చేతులు ఊపడానికి కొన్ని ప్రభావాలు ఏర్పడతాయి. ఒత్తిడి, ఆందోళన కూడా కాళ్లు ఊపడానికి మరో కారణం. ఆరోగ్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం కాళ్లు ఊపే అలవాటును మార్చుకోకపోతే మనకు నష్టమే. అందుకే కాళ్లు ఊపుతూ ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. మనకు ఉన్న చెడు అలవాటును దూరం చేసుకుని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది.