Guinness Book : అమృతమైన తల్లిపాలు నేడు బిడ్డలకు కరువయ్యాయి. అందం పోతుందనో.. త్వరగా ముసలితనం వస్తుందనో అర్థం, పర్థం లేదని సాకులు చెప్తూ బిడ్డలకు తల్లిపాలకు దూరం చేస్తున్నారు. ఇది తల్లికి, బిడ్డకు హాని చేస్తుందని వైద్యులు చెప్పినా వారి మాటలను పెడచెవిన పెడతున్నారు. బిడ్డకు తల్లిపాలను దూరం చేసిన వారందరూ తలవంచుకునేలా చేస్తుంది టెక్సాస్ కు చెందిన అలీస్ ఓగ్లెట్రీ. 2010లో కొడుకుకు జన్మనిచ్చి తల్లిగా మారిన ఆమె తన బిడ్డకు పాలివ్వడంతో పాటు విరాళం కూడా చేసింది. తల్లులు లేని పిల్లలకు 2600 లీటర్ల కంటే ఎక్కువ పాలను అందించింది. గతంలో 1569 లీటర్ల పాలను అమ్మి రికార్డు క్రియేట్ చేసిన అలీస్ ఓగ్లెట్రీ ఆమె రికార్డును ఆమే తిరగరాసింది. ఆమె పాలతో 350000 మంది చిన్నారుల కడుపు నింపింది. అలీస్ ఓగ్లెట్రీని ప్రతీ ఒక్క మాతృమూర్తితో పాటు చిన్నారులు కూడా అభినందిస్తున్నారు.