వినడానికి విచిత్రంగా ఉన్నప్పటికీ ఇది నిజమే సుమా ! కిలో కూరగాయలకు అక్షరాలా లక్ష రూపాయలు. అదేంటి ఏ కూరగాయ తీసుకున్నా 50 రూపాయల నుండి 200 రూపాయలు ఉంటే ఎక్కువ అలాంటిది ఏకంగా లక్ష రూపాయాలు ఏంటి ? అని షాక్ అవుతున్నారా ? ఇంతకీ ఆ కూరగాయలు ఏంటో తెలుసా ……. దానితో ఏం చేస్తారో తెలుసుకోవాలంటే అసలు కథ తెలియాల్సిందే.
” హాప్ షూట్ ” అనే కూరగాయకు మరో పేరు కూడా ఉంది అదే ” హ్యూములస్ లుపులస్ ”. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కూరగాయ. హాప్ షూట్ కూరగాయకు కిలో లక్ష రూపాయలు ఉండటానికి కారణం ఏంటో తెలుసా …… దీనిని ఆల్కహాల్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. హాప్ షూట్ పువ్వులతో ఆల్కహాల్ తయారు చేస్తారు ….. అలాగే ఆకులతో బీరు తయారు చేస్తారు. ఆల్కహాల్ వాడకంలో ఈ కూరగాయను వాడతారు కాబట్టే దీనికి లక్ష రూపాయల ధర ఉంది.
ఇవి ఎక్కువగా ఉత్తర అమెరికా , యురేషియా , దక్షిణ అమెరికాలో మాత్రమే పండేవి. అయితే ఒకప్పుడు భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ లో కూడా పండించేవారట. ప్రస్తుతం బీహార్ లోని ఔరంగాబాద్ లో ఓ రైతు పండిస్తునాడు. అయితే ఈ కూరగాయ సాగుకోసం పెద్ద మొత్తంలో డబ్బులు వెచ్చించాలి ….. అలాగే పంట చేతికి రావాలంటే చాలా కష్టాలే పడాలట దాంతో ఈ పంటను వేయడానికి ఎక్కువగా ముందుకు రావడం లేదు మన దేశంలో. విదేశాల్లో మాత్రం బాగానే గిట్టుబాటు అవుతోందట.