
Menopause : స్త్రీలకు రుతుక్రమం సాధారణం. అది ఆగిపోవడాన్ని మెనోపాజ్ అంటారు. ఇది యాభై ఏళ్లు దాటిన మహిళలకు ఏర్పడుతుంది. మెనోపాజ్ వచ్చిన తరువాత కామన్ గా మహిళలకు లైంగిక వాంఛలు సన్నగల్లుతాయి. ముసలితనం వచ్చినట్లే. దీంతో మెనోపాజ్ లక్షణాలు తెలుసుకుంటే మనకు ఎప్పుడు వస్తుందో అర్థమవుతుంది. మెనోపాజ్ లక్షణాలను తెలుసుకుని అది వచ్చిన తరువాత కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి.
సాధారణ రుతుస్రావం లేకుండా పోతుంది. రుతుస్రావం తక్కువ అవుతుంది. దీంతో గర్భం దాల్చడానికి అవకాశం ఉండదు. పరీక్షల ద్వారా మెనోపాజ్ వచ్చిందో లేదో తెలుసుకోవచ్చు. ఆందోళన, విసుగు చెందడం, తరచుగా మూత్ర విసర్జన, తలనొప్పి, నిద్రలేమి, మానసిక చికాకు, నిరాశ, పొత్తి కడుపులో చర్మం ముడతలు పడటం వంటి లక్షణాలు కనిపిస్తాయి.
లైంగిక కార్యకలాపాల్లో నొప్పి, కాల్షియం లోపం, డిప్రెషన్ వంటివి కూడా కనిపిస్తాయి. దీంతో మెనోపాజ్ వచ్చినట్లు గుర్తించాలి. మెనోపాజ్ వచ్చినా మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. యోగా చేయాలి. వాకింగ్, వ్యాయామం లాంటివి చేయాలి. వేయించిన ఆహారాలు తీసుకోకూడదు. ఎక్కువగా నీరు తాగాలి. పండ్ల రసాలు తీసుకోవాలి.
మెనోపాజ్ వచ్చినప్పుడు శరీరంలో మార్పులు వస్తాయి. ఫెలోషియన్ నాళాలు తగ్గిపోతాయి. గర్భాశయ పరిమాణం తగ్గుతుంది. యోనిలో పీహెచ్ స్థాయిలు తగ్గుతాయి. జీవనశైలి సక్రమంగా ఉంచుకోకపోతే ఊబకాయం సమస్య వస్తుంది. ఇలా మెనోపాజ్ వచ్చిన తరువాత మహళల్లో కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే వారు ఆరోగ్యంగా ఉండగలుగుతారు.