
Taking jaggery : మనకు ఆరోగ్యం కలిగించే ఆహారాల్లో నువ్వులు ఒకటి. ఇందులో తెల్ల నువ్వులు, నల్ల నువ్వులు అని రెండు రకాలు ఉంటాయి. నువ్లుల్లో కాల్షియం ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఎంతో మేలు కలుగుతుంది. నల్ల నువ్వులు పూజాది కార్యక్రమాల్లో వాడుతుంటారు. నువ్వులతో ఎన్నో లాభాలు కలుగుతాయి. బెల్లంతో కలిపి నువ్వులు ముద్దలుగా చేసుకుని తింటే ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు మెండుగా ఉంటాయి.
పూర్వం రోజుల్లో చిన్న పిల్లలకు బెల్లంతో చేసిన నువ్వుల ముద్దలు ఇచ్చేవారు. దీంతో వారి ఆరోగ్యం బాగుండేది. ఇప్పుడు చాలా మంది నువ్వులకు దూరంగా ఉంటున్నారు. దీంతో బలమైన ఆహారం వారికి లభించడం లేదు. నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. చిరుతిళ్లలో వీటిని ఉంచుకుంటే ఎంతో మేలు కలుగుతుంది.
నువ్వులు, బెల్లం కలిపి మధుమేహ బాధితులు తినకూడదు. బెల్లం షుగర్ పేషెంట్లకు నష్టం కలిగిస్తుంది. అందుకే దాని నుంచి దూరంగా ఉండటమే శ్రేయస్కరం. బెల్లం తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. రక్తహీనత ఉన్నవారు బెల్లం, నువ్వులు కలిపి తీసుకుంటే ఎంతో మంచిది. ఐరన్ లోపం ఉన్న స్త్రీలు వీటిని తినడం వల్ల మంచి బలం కలుగుతుంది.
రోజు ఒక చెంచా నువ్వులు, బెల్లం కలిపి తినడం వల్ల అధిక బరువు సమస్య తగ్గుతుంది. చెడు కొలెస్ట్రాల్ ను దూరం చేయడంలో ఇవి కీలక పాత్ర వహిస్తాయి. ఇలాంటి బలమైన ఆహారాన్ని క్రమం తప్పకుండా తిని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి. నువ్వుల్లో ఎంతో శక్తి ఉంటుంది. మాంసాహారం కంటే అధిక రెట్లు కేలరీలు ఇందులో ఉంటాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మనకు ప్రయోజనం కలుగుతుంది.