
Boiled Chickpeas : మనకు బలం చేకూర్చే ఆహారాల్లో ఉలవలు, శనగలు, చికెన్, మటన్, ఫిష్ లాంటివి ఉంటాయి. ఇందులో శనగలు అంటే అందరికి ఇష్టమే. మాంసాహారం తినని వారికి శనగలు మంచి బలమైన ఆహారం. దీంతో రోజు మన ఆహారంలో భాగంగా వీటిని చేసుకోవడం ఉత్తమం. వీటిని తినడం వల్ల మన రోగ నిరోధక వ్యవస్థ బాగుంటుంది. మన శరీరానికి అందే ప్రొటీన్లు ఇందులో ఎక్కువగా ఉంటాయి.
కొంతమంది మాంసాహారం తీసుకోరు. దీంతో వారికి ప్రొటీన్లు అందాలంటే శనగలు తీసుకోవడం ఉత్తమం. దీని వల్ల వారు మటన్ తీసుకున్నంత బలం ఇందులో ఉండటం గమనార్హం. అందుకే శనగలు తీసుకుని మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇందులో మాంసాహారానికి సమానమైన ప్రొటీన్లు ఉంటాయి. అందుకే వీటిని తీసుకుంటే మటన్ తిన్నట్లే లెక్క.
ప్రస్తుత కాలంలో గుండె జబ్బులు పెరుగుతున్నాయి. చెడు కొలెస్ట్రాల్ పెరుగుతుంది. మంచి కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దీంతో గుండెకు మేలు చేస్తాయి. గుండె జబ్బుల నివారణకు తనవంతు పాత్ర పోషిస్తాయి. అందుకే వీటిని తీసుకోవడం వల్ల మన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. రక్తంలో ఎర్ర రక్తకణాల సంఖ్య పెంచుతాయి. ఇలా వీటిని తినడం వల్ల ఎన్నో ఆరోగ్య లాభాలు కలుగుతాయి.
పాలల్లో కాల్షియం ఉంటుందని చాలా మంది పాలు తాగుతుంటారు. కానీ అందులో కంటే ఎక్కువ కాల్షియం ఇందులో ఉంటుంది. దురద, గజ్జి వంటి వాటి నుంచి ఉపశమనం లభించేలా చేస్తుంది. ఎముకలు బలంగా కావడానికి దోహదపడుతుంది. ఇలా శనగలు మన ఆరోగ్య పరిరక్షణలో భాగంగా నిలుస్తున్నాయి. అందుకే వీటిని బలమైన ఆహారంగా చెబుతుంటారు.