Lakme : రతన్ టాటా మరణం దేశంలోని ప్రతీ పేదవాడికి పర్సనల్ లాస్ గానే చెప్పాలి. ఆయన ఒక్కడుంటే చాలు దేశంలో ప్రతీ పేదవాడు ఆనందంగా ఉండగలడు. ఆయన జీవితం ఒక అద్భుత్వం, ఆయన వ్యక్తిత్వం మహోన్నతం. టాటా గ్రూప్స్ సంపాదనలో ప్రతీ 100 రూపాయల్లో 60 రూపాయలను పేదలు, చారిటీల కోసమే ఖర్చు చేసేవారు. ఆ భగవంతుడే పేదల కోసం రతన్ నోవెల్ టాటా రూపంలో దివిపైకి వచ్చాడా.. అన్నంతలా పేదలను ప్రేమగా చూసుకునేవారు. వారు ఎదిగితే దేశం ఎదుగుతుందని భావించే వారు. టాటా దేశ గౌరవాన్ని నింగిలోకి తీసుకెళ్లింది. రతన్ టాటా సవతి తల్లి పేరు సిమోన్ టాటా భారతదేశ బ్యూటీ బ్రాండ్ లాక్మేను రూపొందించడంలో ఈమె పాత్ర పెద్దది. వాటిపై తక్కువ అనుభవం ఉన్నప్పటికీ, బ్యూటీ ఉత్పత్తుల్లో ఆమెకున్న నైపుణ్యం లాక్మేను ప్రపంచ బ్రాండ్‌గా మార్చింది. ఆమె 1982లో లాక్మే చైర్‌పర్సన్ అయ్యారు. తర్వాత 1987లో టాటా ఇండస్ట్రీస్‌లో సభ్యురాలయ్యారు. ఆమె లాక్మే ద్వారా 70,000 కోట్ల బిజినెస్ చేస్తుంది. ఇది కూడా టాటా గ్రూప్స్ లో కలిసి పోయింది. ఇప్పటికీ ప్రతీ ఇంట్లో ఏదో ఒక బ్యూటీ ప్రొడక్ట్ లాక్మే ఉంటుందంటే అతిశయోక్తి కాదు.
https://www.instagram.com/p/