
Sugar patients : ఎండాకాలం కావడంతో ఎండలు మండుతున్నాయి. భానుడి భగభగ కొనసాగుతోంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు బయటకు రావడానికి జంకుతున్నారు. ఈ కాలంలో మధుమేహం ఉన్న వారు మరీ జాగ్రత్తగా ఉండాలి. వడదెబ్బ సోకే ప్రమాదం ఉంటుంది. అందుకే ఆరోగ్య పరిరక్షణకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వేసవిలో చల్లదనం కోసం ఏ డ్రింక్ పడితే అవి తాగకూడదు. ఇలా చేస్తే షుగర్ పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగితే నష్టాలు వస్తాయి. అందుకే డయాబెటిస్ వారు వేసవి కాలంలో జాగ్రత్తలు తీసుకోవాలి. దాహం తీర్చుకునేందుకు మంచినీళ్లు మాత్రమే తాగాలి. లేకపోతే కూల్ డ్రింక్స్, సోడాలు, జ్యూస్ లు, షర్బత్ లు తాగితే అనర్థాలు వస్తాయి. అందుకే అలాంటి వాటికి దూరంగా ఉండటమే మంచిది.
బాదం పాలు తాగితే ఎంతో మేలు. షుగర్ అదుపులో ఉంచడంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో కేలరీల శక్తి, కార్బోహైడ్రేడ్లు ఉండటం వల్ల వీటిని తీసుకోవడం శ్రేయస్కరం. ఆవు పాలకంటే తక్కువ శక్తి ఇందులో ఉంటుంది. అందుకే షుగర్ పేషెంట్లు బాదం పాలు తీసుకోవడం వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ లో ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.
కొబ్బరి పాలు కూడా డయాబెటిస్ వారికి ప్రయోజనం కలిగిస్తాయి. ఇందులో కూడా షుగర్ ను అదుపులో ఉంచే ఫైబర్, ప్రొటీన్లు, విటమిన్లు ఉన్నాయి. అందుకే వీటిని తీసుకోవడం ఉత్తమం. ఇంకా జీడిపప్పు పాలు కూడా షుగర్ వారికి మంచిదే. ఇవి కూడా చక్కెరను అదుపులో ఉంచుతాయి. అందుకే వీటిని తాగడం వల్ల మన ఆరోగ్యం మెరుగు పడుతుంది.